త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | స్కై రూట్ ఏరో స్పేస్ లో స్కిల్ యూనివ‌ర్సిటీ సేవ‌లు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఏరో స్పేస్ (Aero space) విభాగంలో కూడా స్కిల్ యూనివర్సిటీ(Skill University) సేవలను వినియోగించుకోవాలని.. ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శంషాబాద్‌లోని GMR ఏరోస్పేస్ పార్క్‌లో విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

S

News | Published On Apr 25, 2026, 1.52 pm IST

CM Revanth Reddy | స్కై రూట్ ఏరో స్పేస్ లో స్కిల్ యూనివ‌ర్సిటీ సేవ‌లు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: స్కై రూట్ ఏరో స్పేస్ (Skyroot Aerospace) విభాగంలో కూడా స్కిల్ యూనివర్సిటీ(Skill University) సేవలను వినియోగించుకోవాలని.. ఏరో స్పేస్ రంగానికి కావాల్సిన మనవరులను యూనివర్సిటీ ద్వారా అందిస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శంషాబాద్‌లోని GMR ఏరోస్పేస్ పార్క్‌లో విక్రం-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు. స్కిల్స్ కు సంబంధించిన అన్ని విభాగాలను ఈ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి యూనివర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతామ‌ని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా బోర్డు చైర్మన్ గా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.

GMR ఏరోస్పేస్ పార్క్‌లో స్కైరూట్ ఏరోస్పేస్ ను మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబుతో క‌లిసి సీఎం ప‌రిశీలించారు. ఐటీఐ లను టాటా గ్రూప్ సహకారంతో ఏటీసీలు గా మారుస్తున్నాం. సిలబస్ ను కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుస్తున్నాం. విద్యా వ్యవస్థను సమూలం గా మారుస్తున్నాం. విద్యా ప్రమాణాలతో పాటు మౌలిక సదుపాయాలు పెంచబోతున్నాం. ప్రతి విద్యార్థిపై లక్షా 8 వేల రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. మల్లేపల్లి ఏటీసీ సెంటర్ ను కూడా సందర్శించాలి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కాగా అంత‌కుముందు జూబ్లీహిల్స్ లోని త‌న‌ నివాసం నుంచి సీఎం శంషాబాద్ బయలుదేరి వెళ్లారు.

Advertisement
Advertisement