త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | తెలుగులో రిలీజ్ అవుతోన్న సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ – డ‌బ్బింగ్‌పై ట్రోల్స్‌

సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఎక్ దిన్ తెలుగులోకి రాబోతుంది. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీకి ఒక రోజు అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. తెలుగు ట్రైల‌ర్‌ను మంగ‌ళ‌వారం రిలీజ్ చేశారు.

N

News | Published On Mar 24, 2026, 7.57 pm IST

Sai Pallavi | తెలుగులో రిలీజ్ అవుతోన్న సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ – డ‌బ్బింగ్‌పై ట్రోల్స్‌
Advertisement

Sai Pallavi |సాయిప‌ల్ల‌వి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్‌ తెలుగులోకి రాబోతుంది. ఈ సినిమా తెలుగు టైటిల్‌తో పాటు ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ మంగ‌ళ‌వారం రివీల్ చేశారు. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఏక్ దిన్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ త‌న‌యుడు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాతోనే సాయిప‌ల్ల‌వి హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌లో తొలి అడుగు వేయ‌బోతుంది. సునీల్ పాండే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఆమిర్‌ఖాన్ స్వ‌యంగా నిర్మించారు. మే 1న ఏక్ దిన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది.

ఒక రోజు...

ఏక్ దిన్ మూవీ తెలుగులో రిలీజ్ కాబోతుంది. తెలుగు వెర్ష‌న్‌కు ఒక రోజు అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఓ జంట ప్రేమ ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రిస్తూ ఎమోష‌న‌ల్‌గా ట్రైల‌ర్ సాగింది. మీరా అనే యువ‌తి ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డం కోసం ఆ యువ‌కుడు ఏం చేశాడు? మీరా ప్రేమ‌ను ఒక్క రోజు ద‌క్కించుకున్న చాల‌ని అనుకున్న అత‌డి క‌ల తీరిందా లేదా అనే అంశాల‌తో ఈ మూవీ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. విజువ‌ల్స్‌, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటున్నాయి. కంప్లీట్ మంచు ప్ర‌దేశంలోనే ఒక రోజు మూవీ క‌థ మొత్తం సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మెమోరీలాస్‌...

ఇందులో మెమోరీలాస్‌తో బాధ‌ప‌డే యువ‌తిగా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్ ద్వారా మేక‌ర్స్ హింట్ ఇచ్చారు. ఈ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు రేప‌టితో మ‌ర్చిపోయే యువ‌తిగా న‌టిస్తోన్న‌ట్లు చూపించారు.

డ‌బ్బింగ్‌పై ట్రోల్స్‌...

తెలుగు ట్రైల‌ర్‌లో సాయిప‌ల్ల‌వి ఓన్ వాయిస్ వినిపించ‌క‌పోవ‌డంపై ట్రోల్స్ వ‌స్తున్నాయి. మ‌రొక‌రితో ఆమె పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పించారు. డ‌బ్బింగ్ స‌రిగా కుద‌ర‌లేద‌ని కామెంట్లు చేస్తున్నారు. క‌నీసం సినిమాలోనైనా సాయిప‌ల్ల‌వితో డ‌బ్బింగ్ చెప్పాల‌ని కామెంట్స్ పెడుతున్నారు. థాయ్ మూవీ వ‌న్‌డేకు రీమేక్‌గా ఏక్ దిన్ తెర‌కెక్కుతోంది.
గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ పెద్ద సినిమాల‌తో పోటీతో పాటు పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కార‌ణంగా మే 1కి వాయిదావేశారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఏక్‌దిన్‌తో పాటు రామాయ‌ణ సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. దాదాపు 4000 కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సీత‌గా సాయిప‌ల్ల‌వి క‌నిపించ‌బోతున్న‌ది. రాముడిగా ర‌ణ‌భీర్‌క‌పూర్‌, రావ‌ణాసురుడిగా య‌శ్ క‌నిపిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement