త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padi Kaushik Reddy | బండి సంజ‌య్‌ను ఎందుకు అరెస్టు చేయ‌రు..? సీఎం రేవంత్‌ను నిల‌దీసిన పాడి కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy | న‌ర్సంపేట‌కు వెళ్లిన బీఆర్ఎస్ నేత‌లనేమో అరెస్టు చేస్తారు.. అదే బండి సంజ‌య్ వెళ్తే ఎందుకు అరెస్టు చేయ‌రు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిల‌దీశారు. రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఉదాహ‌ర‌ణ ఇదే అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On May 7, 2026, 3.42 pm IST

Padi Kaushik Reddy | బండి సంజ‌య్‌ను ఎందుకు అరెస్టు చేయ‌రు..? సీఎం రేవంత్‌ను నిల‌దీసిన పాడి కౌశిక్ రెడ్డి
Advertisement

Padi Kaushik Reddy | త్రినేత్ర‌.న్యూస్ : న‌ర్సంపేట‌కు వెళ్లిన బీఆర్ఎస్ నేత‌లనేమో అరెస్టు చేస్తారు.. అదే బండి సంజ‌య్ వెళ్తే ఎందుకు అరెస్టు చేయ‌రు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిల‌దీశారు. రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఉదాహ‌ర‌ణ ఇదే అని ఆయ‌న పేర్కొన్నారు. క‌రీంన‌గ‌ర్‌లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రేవంత్ రెడ్డి, బండి సంజ‌య్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి చెబుతున్నా.. న‌ర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవ‌ర్ చ‌నిపోతే.. పరామ‌ర్శించేందుకు వెళ్తే మాజీ హోం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ద‌యాక‌ర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ని అరెస్టు చేస్తారు. మ‌రి బండి సంజ‌య్‌ను ఎందుకు అరెస్టు చేయ‌రు. బండికి పోలీసు ఎస్కార్ట్‌లు, పైల‌ట్‌లు ఇచ్చి అక్క‌డికి తీసుకెళ్లారు. మ‌రి రేవంత్ రెడ్డి మిమ్మ‌ల్ని ఎందుకు అరెస్టు చేయ‌లేదు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా..? అని కౌశిక్ రెడ్డి అడిగారు.

కేటీఆర్ మీద మాట్లాడ‌డం బాధాక‌రం..

ఏడు సెగ్మెంట్ల‌లో ఏం అభివృద్ధి చేశావో ప్ర‌జ‌ల ముందు పెట్టు.. వేముల‌వాడ‌, సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్, చొప్ప‌దండి, మాన‌కొండూరు, హుజురాబాద్‌, హుస్నాబాద్‌లో మీరు ఏం చేశారో చెప్పండి.. మేం ఏం చేశామో చెప్తాం. అభివృద్ధి మీద మాట్లాడు. కేటీఆర్ మీద మాట్లాడ‌డం బాధాక‌రం. తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇలానే మాట్లాడితే బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతారు. మీరు రెస్పెక్ట్ ఇస్తే మేం ఇస్తామ‌ని పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

చేత‌కాని ద‌ద్ద‌మ్మ క‌రీంన‌గ‌ర్ సీపీ..

చేత‌కాని ద‌ద్ద‌మ్మ క‌రీంన‌గ‌ర్ సీపీ. నిద్ర పోయిన గుర్రాల పళ్లు తొముతుండా.. ఏం పీకుతున్నాడు అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాను. సీపీ గారి మీద చెప్పింది నిజం కాదా.. లా అండ్ ఆర్డ‌ర్ త‌ప్పుతుంది.. కరీంన‌గ‌ర్ ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతార‌ని చెప్పాను. పోలీసింగ్ మీద అప్ర‌మ‌త్త‌మై ఉంటే ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగి ఉండ‌క‌పోయేది. సీపీ జ‌ల్సాలు చేస్తున్నాడు. ఈ ప్ర‌భుత్వం ఎందుకు ఫైరింగ్ జ‌రిపిన‌ ఐదుగురిని ప‌ట్టుకోలేదు. గంట వ‌ర‌కు కూడా సీపీ రారా..? ఆయ‌న ఆఫీసు కూత‌వేటు దూరంలోనే ఉంది. సిగ్గుచేటు ఈ ప్ర‌భుత్వానికి. వీఐపీ జోన్ అది. జ‌డ్జి ఇల్లు కూడా అపోజిట్‌లో ఉంది. సీపీ, సీఐని ఎందుకు స‌స్పెండ్ చేయ‌డం లేదు అని కౌశిక్ రెడ్డి ప్ర‌శ్నించారు.

Advertisement
Advertisement