త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padma Devender Reddy | మోదీ.. ముందు బండి సంజ‌య్‌ని త‌ప్పించు.. ఆ త‌ర్వాతే మాట్లాడు

Padma Devender Reddy | తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌సంగించే ముందు బండి సంజ‌య్ (Bandi Sanjay) కుమారుడి బాధిత‌ బాలిక ఘ‌ట‌న‌పై స్పందించాల‌ని మాజీ ఎమ్మెల్యే ప‌ద్మ దేవేంద‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆడ‌బిడ్డ‌ల ఆర్త‌నాదానికి మోదీ స‌మాధానం చెప్పాల‌ని మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా డిమాండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

S

News | Published On May 10, 2026, 1.31 pm IST

Padma Devender Reddy | మోదీ.. ముందు బండి సంజ‌య్‌ని త‌ప్పించు.. ఆ త‌ర్వాతే మాట్లాడు
Advertisement
  • బాలిక ఘ‌ట‌న‌పై స్పందించు
  • అప్పుడే తెలంగాణ ప్ర‌జ‌లు మీ ప్ర‌సంగాన్ని న‌మ్ముత‌రు
  • ఆడ‌బిడ్డ‌ల ఆర్త‌నాదానికి స‌మాధాన‌మివ్వు
  • రేవంత్, బండి బంధానికి ఆడ‌బిడ్డ ఆర్త‌నాదం అడ్డొస్తుందా?
  • బీఆర్ఎస్ వాళ్ల మీద మాత్రం ఉత్సాహంగా కేసులు పెడుతున్న‌రు
  • బీజేపీ, కాంగ్రెస్‌పై మాజీ ఎమ్మెల్యే ప‌ద్మ దేవేంద‌ర్‌రెడ్డి ధ్వ‌జం

Padma Devender Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ‌లో ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌సంగించే ముందు బండి సంజ‌య్ (Bandi Sanjay) కుమారుడి బాధిత‌ బాలిక ఘ‌ట‌న‌పై స్పందించాల‌ని మాజీ ఎమ్మెల్యే ప‌ద్మ దేవేంద‌ర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మీరు ఈ ఘ‌ట‌న‌పై ఏం చెప్తారోన‌ని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌ని చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆదివారం మ‌హిళా నాయ‌కురాళ్ల‌తో క‌లిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆడ‌బిడ్డ‌ల ఆర్త‌నాదానికి మోదీ స‌మాధానం చెప్పాల‌ని మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా డిమాండ్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

మీ మంత్రివ‌ర్గంలో హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బండి కుమారుడే ఇలా చేస్తే మిగ‌తా వారి ప‌రిస్థితి ఏంటి. ఉల్టా ఆ బాలిక మీద‌నే కేసులు పెట్ట‌డం ఏంది? ఇక్క‌డ‌ ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వైంది. బండిని మోదీ స‌భ‌కు పిలిచినా పిల‌వ‌క‌పోయినా ప‌ర్వాలేదు. కానీ బాధిత కుటుంబంపై ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు బండి సంజ‌య్‌ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాలి. మోదీ.. ముందు బండి కుమారుడి ఘ‌ట‌న‌పై మాట్లాడు. ఆ త‌ర్వాతే ప్ర‌సంగించు. అప్పుడే మీ ప్ర‌సంగాల‌ను ప్ర‌జ‌లు న‌మ్ముతారు అని ఆమె హిత‌వు ప‌లికారు.

మాకు ఆడ‌బిడ్డ ఆర్త‌నాద‌మే వినిపిస్త‌ది..

బాధిత బాలిక ఘ‌ట‌న‌పై మీరు ఏం చెప్తారోన‌ని ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. మీరెన్ని ప్ర‌సంగాలు ఇచ్చినా మాకు ఆ అమ్మాయి ఆర్త‌నాద‌మే వినిపిస్త‌ది. మీరు రూ.9 వేల కోట్లతో రోడ్లు వేసినా, ఇంకేదో ప‌ని చేసినా మాకు కావాల్సింది ఆడ‌బిడ్డ ఆర్త‌నాదం. మాట్లాడేముందు ఆ ఆర్త‌నాదానికి స‌మాధానం చెప్పండి. ఆడ‌బిడ్డ‌కు, ఆ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించండి. విచార‌ణ పార‌ద‌ర్శ‌కంగా చేయండి. బండి ప‌ద‌విలో ఉంటే అంద‌రినీ ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంట‌ది. అందుకే ముందు ఆయ‌న్ను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయండి అని ప‌ద్మ‌ డిమాండ్ చేశారు.

బేటీ బ‌చావో, బేటీ ప‌డావో నినాదాల‌కే ప‌రిమితం..

బాలిక‌కు న్యాయం జ‌ర‌గాలంటే ముందు బండిని త‌ప్పించండి. బేటీ బ‌చావో, బేటీ ప‌డావో కేవ‌లం నినాదాల‌కే ప‌రిమిత‌మైన‌య్. నారీ శ‌క్తీ స‌మ్మాన్ కూడా నినాదాల‌కే స‌రిపోయింది. ఆడ‌బిడ్డ‌ల 33 శాతం రిజ‌ర్వేష‌న్ కూడా అంతే. తెలంగాణ‌లో, దేశంలో ఎక్క‌డా ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ లేదు. క్రైమ్ రేటు పెరిగింది. అత్యాచారాలు, వేధింపులు పెరుగుతున్న‌య్‌. ఇవేవీ మీకు క‌నిపిస్త‌లేవా. ఆకాశంలో స‌గ‌భాగం ఉన్నం. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఓ త‌ల్లిలా ఆవేద చెందుతున్నం.

బండి.. మీకు మీరే రాజీనామా చేయండి..

వ‌చ్చినమా, పోయినమా అంటే కుద‌ర‌దు మోదీ గారు. మీరు స్పందించండి. మాన‌వ‌త్వంతో ఆలోచించి బండి సంజ‌య్ స్వ‌త‌హాగా రాజీనామా చేయాలి. ధ‌ర్మం, న్యాయం, చ‌ట్టం అని మాట్లాడే మీరు రాజీనామా చేయండి. మ‌రి ఇప్పుడు ధ‌ర్మం, న్యాయం, చ‌ట్టం ఏమైంది. మీకు మీరుగా రాజీనామా చేసి బాలిక‌కు న్యాయం చేయండి. ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు వ‌ద్దు.

రేవంత్‌.. క‌నీసం బాలిక‌కైనా న్యాయం చెయ్‌..

రేవంత్‌రెడ్డి.. హోం శాఖ మీ చేతుల్లో ఉంది. బండి సంజ‌య్ మీకు ఫ్రెండు కావొచ్చు. బీజేపీ, కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం కావొచ్చు. ఆడ‌బిడ్డ ఆర్త‌నాదానికి ఈ బంధం అడ్డొస్తుందా? ఇద్ద‌రు హోం హోం క‌లిసిండ్ర‌లు. కానీ ఆడ‌పిల్ల‌లు ఎక్క‌డ పోవాలే? పోక్సో కేసు న‌మోదైనా ఇప్ప‌టికీ చ‌ర్య‌లు లేవు. రేవంత్ ఎట్లాగో రాష్ట్రానికి ఏం చేస్త‌లేరు. బాలిక‌కైనా న్యాయం చేయండి. సీపీ సుమ‌తి అర్ధ‌రాత్రి దిల్‌సుఖ్ న‌గ‌ర్‌లో నిల‌బ‌డితే ఒక గ‌స్తీ పోలీసు కూడా రాలేద‌ని చెప్తున్న‌రు. వ‌డ్లు అమ్ముడు పోత‌లేవ‌ని మీ క‌లెక్ట‌ర్లే చెప్తున్న‌రు. ఆరు గ్యారంటీలు లేవు, క‌నీసం ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి అని ఫైర‌య్యారు.

బీఆర్ఎస్ వాళ్ల మీద కేసులు పెట్టాలంటే ఉత్సాహంగా పెడుతున్న‌రు. బాలిక త‌ల్లిదండ్రులు మొత్తుకున్నా కేసు పెట్ట‌కుండా ఇబ్బంది పెట్టారు. సాయి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాలి. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మోదీని డిమాండ్ చేస్తున్నం అని ప‌ద్మ దేవేంద‌ర్‌రెడ్డి అన్నారు. లేదంటే మ‌హిళలం అంద‌రం క‌లిసి పెద్ద ఎత్తున ఉద్య‌మానికి తెర లేపుతామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement