త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | ఢిల్లీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్‌

Delhi | ఉత్త‌ర భార‌త‌దేశం (North India)లో తీవ్ర‌మైన పొగ‌మంచు (Fog) కార‌ణంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)కి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ (Red Alert) జారీ చేసింది. దీని కార‌ణంగా 150 విమాన స‌ర్వీసులు ర‌ద్దుకాగా, మ‌రో 200 స‌ర్వీసులు ఆల‌స్య‌మ‌య్యాయి.

A

News | Published On Dec 19, 2025, 2.58 pm IST

Delhi | ఢిల్లీకి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్‌
Advertisement

Delhi | ఉత్త‌ర భార‌త‌దేశం (North India)లో తీవ్ర‌మైన పొగ‌మంచు (Fog) కార‌ణంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)కి వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ (Red Alert) జారీ చేసింది. అన్ని ర‌కాల ర‌వాణాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని హెచ్చ‌రించింది. అందుకు త‌గిన‌ట్లే 150కి పైగా విమాన స‌ర్వీసులు ర‌ద్ద‌వ‌డంతో పాటు మ‌రో 200కు పైగా విమాన స‌ర్వీసులు ఆల‌స్య‌మ‌య్యాయి. పొగ‌మంచు కార‌ణంగా ఈ అంత‌రాయాలు కొన‌సాగుతాయ‌ని విమానాశ్ర‌య అధికారులు వెల్ల‌డించారు.

ఉత్త‌ర భార‌త దేశాన్ని పూర్తిగా పొగ‌మంచు క‌ప్పేసింది. క‌నీసం వంద మీట‌ర్ల దూరంలోని వాహ‌నాలు సైతం కాన‌రాని ప‌రిస్థితి త‌లెత్తంది. పంజాబ్‌, హ‌ర్యానా, ఢిల్లీ, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌, మధ్య‌ప్ర‌దేశ్‌, బీహార్ రాష్ట్రాల‌ను పొగ‌మంచు క‌ప్పేసిన‌ట్లు ఉప‌గ్ర‌హ చిత్రాల ద్వారా తెలిసింద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement