BharatNet | మారుమూల పల్లెకు కూడా భారత్‌నెట్.. త్వరలో 2,22,341 గ్రామాలకు ఇంటర్నెట్
BharatNet | 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ముందుగా ఇంటర్నెట్ సర్వీసును అందించి ఆ తర్వాత గ్రామ పంచాయతీ కానీ గ్రామాలకు అంటే గూడేలకు, మారుమూల పల్లెలకు కూడా బ్రాడ్ బాండ్‌ను విస్తరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
BharatNet | ఇంటర్నెట్ వాడకం ఈరోజుల్లో కామన్. డిజిటల్ యుగం ఇది. నగరాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ ఇంటర్నెట్ వాడుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ సర్వీసులను అందిస్తోంది. ఈ గవర్నెన్స్, టెలిమెడిసిన్, ఈ ఎడ్యుకేషన్ లాంటి డిజిటల్ సర్వీసులను మారుమూల పల్లెకు కూడా అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల పల్లెకు కూడా ఇంటర్నెట్ అందించేందుకు భారత్‌నెట్ బ్రాడ్ బ్యాండ్‌ను తీసుకొచ్చింది. బీబీఎన్ఎల్ కంపెనీ ద్వారా రెండు దశల్లో ఈ ప్రాజెక్ట్‌ను తీసుకొస్తోంది. 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ముందుగా ఇంటర్నెట్ సర్వీసును అందించి ఆ తర్వాత గ్రామ పంచాయతీ కానీ గ్రామాలకు అంటే గూడేలకు, మారుమూల పల్లెలకు కూడా బ్రాడ్ బాండ్‌ను విస్తరించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
భారత్‌నెట్ బ్రాడ్ బాండ్ సర్వీసులపై లోక్ సభలో ఇటీవల అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ వివరాలు అందించారు. రెండు దశల్లో భారత్‌నెట్ బ్రాడ్ బాండ్ సేవలను విస్తరిస్తున్నామని, ఫేజ్ 1, ఫేజ్ 2 లో 2,22,341 గ్రామ పంచాయతీల్లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయని అందులో ఇప్పటికే 2,14,904 గ్రామ పంచాయతీల్లో సర్వీసులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారత్‌నెట్ బ్రాడ్ బాండ్ అమలుపై రివ్యూ చేస్తోందని, స్టేట్ బ్రాడ్ బాండ్ కమిటీలు, జిల్లా స్థాయి టెలికం కమిటీలు కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.
అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్(ABP) అమలు
4 ఆగస్టు, 2023న అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించింది. భారత్‌నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా 2.64 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా కనెక్టివిటీ ఇవ్వడం, 3.8 లక్షల గ్రామ పంచాయతీలు కానీ గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేశారు. డిజైన్ బిల్డ్ ఆపరేట్ అండ్ మెయిన్‌టెన్(DBOM) మోడల్ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ని ఓపెన్ బిడ్డింగ్ ప్రాసెస్ ద్వారా ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





