Crime Thriller OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో మైండ్‌బ్లాక్ చేసే బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – బెగ్గింగ్ మాఫియా మోసాలతో
రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మర్దానీ 3 ఈ వారమే ఓటీటీలో సందడి చేయబోతుంది. మార్చి 27న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
Crime Thriller OTT | బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ మర్దానీ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించాడు. మర్దానీ ఫ్రాంచైజ్‌లో మూడో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
నెలన్నర తర్వాత...
తాజాగా థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత ఈ బాలీవుడ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మర్దానీ 3 మూవీలో జాన్కీ బోడీవాలా, మల్లికా ప్రసాద్, జిషుషేన్ గుప్తా కీలక పాత్రల్లో నటించారు.
మిక్స్‌డ్ టాక్...
థియేటర్లలో మర్దానీ 3 మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రాణి ముఖర్జీ యాక్టింగ్‌తో పాటు కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. దాదాపు 60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 78 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మర్దానీతో పాటు మర్దానీ2లోనూ రాణి ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఆమె భర్త, ఆదిత్య చోప్రా నిర్మించాడు.
మెచ్యూర్డ్ కానీ అమ్మాయిలు...
ఢిల్లీలో వరుసగా మెచ్యూర్డ్ కానీ అమ్మాయిలు అదృశ్యమవుతుంటారు. ఈ కేసు మిస్టరీని ఛేదించే బాధ్యతను ఐపీఎస్ ఆఫీసర్ శివానీ రాయ్‌కి అప్పగిస్తారు అధికారులు. ఈ కిడ్నాప్స్ వెనుక అమ్మ అనే మహిళ ఉందని శివానీ రాయ్ కనిపెడుతుంది. కేసు ఇన్వేస్టిగేషన్‌లో శివానీ రాయ్‌కి ఎలాంటి షాకింగ్ నిజాలు తెలిశాయి? బెగ్గింగ్ మాఫియా గుట్టును ఎలా రట్టు చేసింది? కిడ్నాప్ అవుతున్న అమ్మాయిలందరూ ఏమయ్యారు? అనే అంశాలతో మర్దానీ 3 మూవీ తెరకెక్కింది.
ప్రస్తుతం షారుఖ్‌ఖాన్ కింగ్ మూవీలో రాణి ముఖర్జీ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 24న కింగ్ మూవీ రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



