Rahul Gandhi I మెస్సీ -రేవంత్ మ్యాచ్ కు రాహుల్ గాంధీ రాక
ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు
మెస్సీ -రేవంత్ మ్యాచ్ కు రాహుల్ గాంధీ రాక
త్రినేత్ర.న్యూస్: ఉప్పల్ స్టేడియంలో శనివారం (2025 డిసెంబరు 13న) జరగబోయే సింగరేణి - RR9 (Revant Reddy) & అపర్ణ Messy All stars మ్యాచ్ కు అటు ఫుట్ బాల్ దిగ్జజం లియోనల్ మెస్సీతో పాటు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 లో భాగంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ కు కొనసాగింపుగా.. అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (గోట్ GOAT)లో భాగంగా 2025 డిసెంబరు 13 నుంచి 15 వరకు కోల్ కతా, న్యూ ఢిల్లీ, ముంబైతో పాటు హైదరాబాద్ నగరాల్లోనూ మెస్సీ పర్యటించనున్నారు. 14 సంవత్సరాల తర్వాత మెస్సీ భారతదేశంలో పర్యటించడం గమనార్హం. కాగా తొలుత షెడ్యూల్ లో హైదరాబాద్ పర్యటన లేదని.. ఆ తర్వాత ఇది చేరిందని తన ఇన్స్టా అకౌంట్ ద్వారా మెస్సీ తెలిపారు.
హైదరాబాద్ కు ఎందుకొస్తున్నారు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వపు ప్రజా పాలన పూర్తై రెండేళ్లు పూర్తైన సందర్భంగా డిసెంబరు 8,9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఇందుకు కొనసాగింపుగా రాష్ట్రానికి ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకొచ్చే ఉద్దేశంతో ఫుట్ బాల్ గే మ్ ఐకాన్ లియోనల్ మెస్సీని ఆహ్వానించింది.
రేవంత్ వర్సెస్ మెస్సీ
సింగరేణి - RR9 (Revant Reddy) & అపర్ణ Messy All stars అనే రెండు జట్ల మధ్య 20 నిమిషాల పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో చివరి 5 నుంచి 10 నిమిషాల్లో సింగరేణి జట్టు నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ జట్టు తరపున మెస్సీ ఆడుతారు. ఆట ముగిసిన తర్వాత మెస్సీ స్టేడియం అంతా కలియదిరిగి ప్రేక్షకులకు అభివాదం చేస్తారు. అయితే ఈ కార్యక్రమంలో మెస్సీ తో ఫొటో దిగాలనుకునేవారు మాత్రం తప్పనిసరిగా 9,95,000 చెల్లించాల్సిందే
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





