CM Revanth Reddy | పంట కాలిన రైతులను వెంటనే ఆదుకోండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
CM Revanth Reddy | విద్యుదాఘాతం కారణంగా మొక్కజొన్న(Maize) పంట కాలిపోయిన బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయిన ఘటనపై సీఎం వెంటనే స్పందించారు. ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: విద్యుదాఘాతం కారణంగా మొక్కజొన్న(Maize) పంట కాలిపోయిన బాధిత రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ (Nirmal) జిల్లా పెంబి మండల కేంద్రంలో చేతికొచ్చిన మొక్కజొక్క పంట కాలిపోయిన ఘటనపై సీఎం వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
నిర్మల్ జిల్లాలో జరగిన ఘటనపై బాధిత రైతులు ఆవేదనలో ఉన్నారన్న సమాచారంపై ముఖ్యమంత్రి స్పందించారు. ఆ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలించాలన్నారు. నష్టపోయిన రైతులకు తగిన విధంగా ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని సీఎంవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలందిన వెంటనే స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్ అవసరమైన చర్యలు చేపట్టారు.
పంట చేనులోనే మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. చేతికొచ్చిన మొక్కజొన్న కళ్ల ముందే కాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆరుగాలం కష్టపడి, ఎండనక, వాననకా కన్న బిడ్డలా పంటను పెంచుకున్నామని బోరున విలపించారు. కాలిపోయిన కంకులను చూపిస్తూ మనో వేదనకు గురయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
చేతికొచ్చిన పంట నోటికందలే.. ఇది వ్యవస్థ వైఫల్యమే: భూక్యా జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, ఖానాపూర్
ఖానాపూర్ నియోజకవర్గంలోని పెంబి మండలంలో విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ కారణంగా కోతకు సిద్ధంగా ఉన్న 5 ఎకరాల పైన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతుల కళ్లముందే కాలిపోయింది. బాధిత రైతు కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. చేతికి వచ్చిన పంట నోటికి అందలేదు. అనే రైతు ఆవేదన హృదయాన్ని కలచివేస్తోంది. ఇది కేవలం ఒక రైతు నష్టమే కాదు.. వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. సంబంధిత అధికారులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి, బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సహాయం, పూర్తి నష్టపరిహారం అందించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి.
View this post on Instagram
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



