Stephen Raveendra | సరిపడా పెట్రోల్ ఉంది.. అపోహలతో నిల్వ చేసుకోవద్దు: స్టీఫెన్ రవీంద్ర
Stephen Raveendra | రాష్ట్రంలో సరిపడా పెట్రోల్, డీజిల్(Diesel) నిల్వలు ఉన్నాయని, సరఫరా క్రమం తప్పకుండా జరుగుతున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra) తెలిపారు. నిన్న ఒక్క రోజే 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేశామన్నారు.
Petrol | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో సరిపడా పెట్రోల్, డీజిల్(Diesel) నిల్వలు ఉన్నాయని, సరఫరా క్రమం తప్పకుండా జరుగుతున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra) తెలిపారు. సోమవారం (27వ తేదీన) డిమాండ్ ను మించి పెట్రోల్, డీజిల్ లను 29,939 కిలో లీటర్లు సరఫరా చేసినట్లు చెప్పారు. సగటున రోజుకు 5,883 కిలో లీటర్లు పెట్రోల్, 7,348 కిలో లీటర్లు డీజిల్ కు డిమాండ్ ఉండేదని ఆయన వివరించారు.
నిన్న ఒక్కరోజే 11,490 కిలో లీటర్లు సరఫరా..
కానీ నిన్న ఒక్క రోజే 11,490 కిలో లీటర్లు పెట్రోల్, 18,449 కిలో లీటర్లు డీజిల్ ను వాహనదారులకు సరఫరా చేశామన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. లేనిపోని అపోహలతో పెట్రోల్, డీజిల్ ను నిల్వ చేసుకోవద్దని వినియోగదారులకు సూచించారు.
మరోవైపు హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందన్న వదంతులతో మూడో రోజూ పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెరిచి ఉన్న పెట్రోల్ బంకుల ముందు వాహనాలు బారులు తీరుతున్నాయి. చంపాపేట్, ఐఎస్ సదన్‌లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు ఆందోళనకు దిగారు. గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



