RTC Passengers | ఆర్టీసీ చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌కు షాక్.. చెప్పులతో చితకబాదిన ప్రయాణికులు
RTC Passengers | సాధారణంగా అయితే చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌కు టికెట్టు లేకుండా దొరికితే ప్రయాణికుడికి, కండెక్టర్‌కు జరిమానా విధిస్తాడు. ఆపై కేసు కూడా నమోదవుతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కండక్టర్ (Conducter), ప్రయాణికులు కలిసి చెకింగ్ ఇన్‌స్పెక్టర్ (Checking inspector) పై చెప్పులతో దాడికి దిగారు.
RTC Passengers | త్రినేత్ర.న్యూస్: సాధారణంగా అయితే చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌కు టికెట్టు లేకుండా దొరికితే ప్రయాణికుడికి, కండెక్టర్‌కు జరిమానా విధిస్తాడు. ఆపై కేసు కూడా నమోదవుతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. కండక్టర్ (Conducter), ప్రయాణికులు కలిసి చెకింగ్ ఇన్‌స్పెక్టర్ (Checking inspector) పై చెప్పులతో దాడికి దిగారు. ఎడాపెడా కొడుతూ దేహశుద్ధి చేశారు. ఇంతకు ఏం జరిగిందంటే..
ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు శుక్రవారం హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ కు వెళ్తోంది. మార్గమధ్యలో బస్సును రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం అధికారులు ఆపారు. వెంటనే బస్సులోకి ప్రవేశించి చెకింగ్ చేపట్టారు. ఈ క్రమంలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని టికెట్ ఇన్‌స్పెక్టర్ గుర్తించారు. అయితే సదరు ప్రయాణికుడికి, కండక్టర్‌కు జరిమానా విధించాల్సింది పోయి లంచం డిమాండ్ చేశాడు. ప్రయాణికుడితో పాటు కండక్టర్‌పై కేసు కాకుండా ఉండేందుకు రూ. 20వేలు లంచం ఇవ్వాలంటూ హుకుం జారీ చేశాడు.
బస్సులోని ప్రయాణికులంతా జరిమానా విధిస్తారేమో అనుకున్నారు. కానీ లంచం అడిగిన విషయం వారి చెవిన పడింది. దీంతో తప్పును సరిదిద్దాల్సిన అధికారులే లంచం అడగడమేంటి అని కోపోద్రేక్తులయ్యారు. ఆ వెంటనే టికెట్ ఇన్‌స్పెక్టర్ పై చెప్పులతో డాడి చేసి దేహశుద్ధి చేశారు. కండక్టర్ సైతం ఎడా పెడా వాయించాడు. కొందరు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ చితకబాదారు. ఇక చేసేది లేక టికెట్ ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా లంచం అడిగిన ప్రతి ఒక్కరికీ ఇలాగే తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఆర్టీసీ బస్సులో టికెట్ లేని ప్రయాణం
కండక్టర్, ప్రయాణికుడిని రూ.20వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్‌స్పెక్టర్
టికెట్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న బస్సు
రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ కోసం ఆపిన అధికారులు
టికెట్… pic.twitter.com/vvRdlplfRd
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 1, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



