Bhatti Vikramarka | కాంగ్రెస్ గెలిస్తేనే పుదుచ్చేరికి రక్షణ: భట్టి, పొన్నం
Bhatti Vikramarka | ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka mallu) అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు విద్యలింగంతో కలిసి పుదుచ్చేరి లోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు.
త్రినేత్ర.న్యూస్: ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ (Congress), డీఎంకే (DMK) కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka mallu) అన్నారు. శుక్రవారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షుడు విద్యలింగంతో కలిసి పుదుచ్చేరి లోని మనవేలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన అనంతరామన్ , ఎం బాలం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా బరిలో నిలిచిన లక్ష్మీకాంత న్ ను గెలిపించాలని కోరారు.

భట్టి విక్రమార్క స్థానిక ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురండి పుదుచ్చేరిని రక్షించండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, డీఎంకే పార్టీలతో కూడిన spa కూటమి ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్డీయే కూటమి చేస్తున్న అసత్యాలను నమ్మవద్దన్నారు. పుదుచ్చేరి బంగారు భవిష్యత్తుకు spa కూటమిని గెలిపించడం ఒక్కటే పరిష్కార మార్గం అన్నారు. గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని డిప్యూటీ సీఎం అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని భట్టి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ వృద్ధి రేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



