త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Seethakka | మీకో నీతి.. మాకో నీతా?.. కేటీఆర్ క్ష‌మాప‌ణ చెప్పు..

పార్టీ ఫిరాయింపుల‌పై కేటీఆర్ (KTR) మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని మంత్రి సీత‌క్క (Seethakka) అన్నారు. దానం నాగేంద‌ర్‌ (Daanam Nagendar), క‌డియం శ్రీ‌హ‌రి(kadiyam Srihari) పై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ తీర్పు వెలువ‌రించిన నేప‌థ్యంలో గాంధీభ‌వ‌న్‌లో బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. మీ నాయన కేసీఆర్ (KCR) ఫిరాయింపుల పితామహుడు అని ఆరోపించారు.

S

News | Published On Mar 11, 2026, 3.25 pm IST

Seethakka | మీకో నీతి.. మాకో నీతా?.. కేటీఆర్ క్ష‌మాప‌ణ చెప్పు..
Advertisement

- ఫిరాయింపుల‌పై కేటీఆర్ మాట్లాడ‌డం విడ్డూరం
- బీఆర్ఎస్ హ‌యాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను తీసుకోలేదా?
- త‌ల‌సాని, స‌బితకు మంత్రి ప‌ద‌వులివ్వ‌లేదా?
- మీ నాయిన‌ కేసీఆరే ఫిరాయింపుల పితామ‌హుడు
- గాంధీభ‌వ‌న్‌లో మంత్రి సీత‌క్క ఫైర్‌

త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ ఫిరాయింపుల‌పై కేటీఆర్ (KTR) మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని మంత్రి సీత‌క్క (Seethakka) అన్నారు. దానం నాగేంద‌ర్‌ (Daanam Nagendar), క‌డియం శ్రీ‌హ‌రి(kadiyam Srihari) పై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ తీర్పు వెలువ‌రించిన నేప‌థ్యంలో గాంధీభ‌వ‌న్‌లో బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్త‌గా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపుల‌కు పురుడు పోసింది టీఆర్ ఎస్ కాదా అని ప్ర‌శ్నించారు. మీరు ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అభివృద్ధి కోసం.. ఇతర పార్టీలు చేర్చుకుంటే ప్రజాస్వామ్యం పై దాడి అంటూ మాట్లాడటం స‌రికాద‌న్నారు. మీకు ఒక నీతి.. ఇత‌రుల‌కు ఇంకో నీతా? ఫైర‌య్యారు. బీఆర్ నేతలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నార‌ని, ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

పార్టీల‌ను విలీనం చేసుకోలేదా?

బీఆర్ఎస్ (BRS) అధికారం లో ఉన్నపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లను మీ పార్టీలో చేర్చుకోలేదా? మండలి చైర్మన్ పదవి లాగేసుకున్న‌ది మ‌ర్చిపోయారా? నువ్వేదో నీతిమంతుడివైనట్టు పార్టీ ఫిరయింపుల పై మాట్లాడుతున్నావు అని మ‌డిప‌డ్డారు. మీ నాయన కేసీఆర్ (KCR) ఫిరాయింపుల పితామహుడు అని ఆరోపించారు. ముందు కేటీఆర్ క్షమాపణలు చెప్పి మాట్లాడాల‌ని డిమాండ్ చేశారు. విపక్ష పార్టీలు లేకుండా పార్టీలకు పార్టీలను విలీనం చేసుకున్న‌ప్పుడు గుర్తు లేదా? ఇతర పార్టీల్లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్ర రెడ్డి ని తీసుకొని నేరుగా మంత్రి పదవి ఇచ్చింది మర్చిపోయావా.. అంటూ ఎద్దేవా చేశారు.

సీఎం కుర్చీని లాక్కుంటున్న బీజేపీ..

స్పీకర్ (Speaker) తన పరిధి మేరకే నిర్ణయం తీసుకున్నారని, ఆయ‌న‌కు కొన్ని అధికారాలు ఉంటాయని చెప్పారు. ఆ అధికారం మేరకే పార్టీ ఫిరయింపులపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. విపక్షాలను మింగేస్తున్న బీజేపీ (BJP) కూడా ఫిరాయింపులపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీహార్ లో నితీశ్‌ కుమార్ (Nitish Kumar) సీఎం కూర్చీని లాక్కుంటున్నారని విమ‌ర్శించారు. దానికి బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి (Kishan reddy) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement