త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Thunga Balu | పేద‌ల‌కో నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా?: తుంగ బాలు

Thunga Balu | ఓ బాధిత‌ బాలిక మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని.. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా వేధించడం అత్యంత దారుణమని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బండి సాయి భ‌గీరథ్‌ (Sai Bhagirath)ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

S

News | Published On May 10, 2026, 3.40 pm IST

Thunga Balu | పేద‌ల‌కో నీతి.. మంత్రి కొడుక్కి మరో నీతా?: తుంగ బాలు
Advertisement
  • బండి సాయి భ‌గీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
  • బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్ట‌డం అమానుషం
  • బీజేపీ, కాంగ్రెస్ క‌లిసి బాధిత కుటుంబానికి అన్యాయం చేస్తున్నాయి
  • బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్ర‌హం

Thunga Balu | త్రినేత్ర‌.న్యూస్‌: ఓ బాధిత‌ బాలిక మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని.. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని నేరస్తుల్లా వేధించడం అత్యంత దారుణమని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “బేటీ బచావో” అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే బీజేపీ (BJP) నాయకత్వం ఇప్పుడు కేంద్ర మంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంద‌ని ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భ‌గీరథ్‌ (Sai Bhagirath)ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో “చలో డీజీపీ కార్యాలయం” ముట్టడి కార్యక్రమం సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

హ‌నీట్రాప్ పేరుతో బాలిక‌కు వేధింపులు..

తుంగ బాలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒక బాలిక అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు వెంటనే స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బాధితురాలిపైనే ఎదురు కేసులు నమోదు చేయడం అమానుషమని, హనీట్రాప్, వసూళ్ల పేరుతో స‌ద‌రు బాలికను వేధించడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బాధిత కుటుంబానికి అన్యాయం చేస్తున్నాయనే అనుమానం ప్రజల్లో పెరుగుతోందని పేర్కొన్నారు.

చ‌ట్టం అంద‌రికీ సమానమే..

గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీజేపీ నాయకత్వం తీవ్ర స్థాయిలో స్పందించేదని, కానీ నేడు బాలికకు సంబంధించిన ఘటనలో రాష్ట్ర బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. “సాధారణ ప్రజలకు ఒక న్యాయం.. కేంద్ర అధికార పార్టీల నేతల కుటుంబ సభ్యులకు మరో న్యాయమా?” అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలని, నిందితుడైన బండి సాయి భ‌గీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి నరేంద్ర మోదీ వ‌చ్చార‌ని.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తుంగ బాలు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement