త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | హైద‌రాబాద్‌లో మ‌రో దారుణం : బాలిక‌ను బ‌లితీసుకున్న బంధువు

Murder | ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం గ‌మ‌నించి, ఇంట్లోకి చొర‌బ‌డి మైన‌ర్ బాలిక‌ను క‌త్తితో పొడిచి చంపిన (Murder) దుర్ఘ‌ట‌న ముషీరాబాద్ (Musheerabad) డివిజ‌న్‌లో చోటు చేసుకుంది.

A

News | Published On Dec 8, 2025, 4.14 pm IST

Murder | హైద‌రాబాద్‌లో మ‌రో దారుణం : బాలిక‌ను బ‌లితీసుకున్న బంధువు
Advertisement

Murder | హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో దారుణ హ‌త్య (Murder) చోటు చేసుకుంది. ముషీరాబాద్ (Musheerabad) డివిజ‌న్ ప‌రిధిలోని బాపూజీన‌గ‌ర్ (Bapuji Nagar) బ‌స్తీలో నివాస‌ముంటున్న బాలిక (17)ను స‌మీప బంధువు ఇంట్లోకి జొర‌బ‌డి క‌త్తితో పొడిచి పొడిచి హ‌త్య చేశాడు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కాంతారావు, ల‌క్ష్మి దంప‌తుల కుమ‌ర్తెను వివాహం చేసుకునేందుకు స‌మీప బంధువు ఉమాశంక‌ర్ అడిగాడు. ఉమాశంక‌ర్ మ‌ద్యానికి మాసిన‌వ‌డంతో బాలిక వివాహానికి నిరాక‌రించింది. దీంతో బాలిక‌పై అత‌ను క‌క్ష పెంచుకున్నాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇంట్లో చొర‌బ‌డి ఆమెను హ‌త్య చేశాడు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని గాంధీ ఆస్ప‌త్రి (Gandhi Hospital) కి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement