Murder | భగ్గుమన్న పాతకక్షలు.. వేట కొడవళ్లతో అన్నదమ్ముళ్లను నరికి చంపిన ప్రత్యర్థులు
Murder | పాతకక్షలతో ఓ ఇద్దరు అన్నదమ్ముళ్లను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపారు. ఈ దారుణ ఘటన ఏపీ పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Murder | త్రినేత్ర.న్యూస్ : పాతకక్షలతో ఓ ఇద్దరు అన్నదమ్ముళ్లను ప్రత్యర్థులు వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపారు. ఈ దారుణ ఘటన ఏపీ పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ జంట హత్యల నేపథ్యంలో అడిగొప్పల గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మృతులను గ్రామానికి చెందిన కొత్తా హనుమంతు, కొత్త శ్రీరాంమూర్తిగా పోలీసులు గుర్తించారు. తమ్ముడు హనుమంతును గ్రామం మధ్యలో, అన్న శ్రీరాంమూర్తిని అమ్మవారి గుడి సమీపంలో వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు. అయితే అన్నదమ్ములిద్దరూ కూడా తెలుగు దేశం పార్టీ సానుభూతి పరులు అని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ క్రమంలో జంట హత్యలపై జిల్లా ఇంచార్జి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. హత్యకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టొద్దని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని రవికుమార్ ఆదేశించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






