Hyderabad | బంగారం కోసం ఇంటి యజమాని హత్య.. కేసు ఛేదించిన నాచారం పోలీసులు
Hyderabad | బంగారం కోసం ఇంటి యజమానిని హత్య (Murder) చేసిన కేసును నాచారం (Nacharam) పోలీసులు ఛేదించారు. హత్య చేసిన నిందితుడితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని, గోదావరి నదిలో గాలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | బంగారం కోసం ఇంటి యజమానిని హత్య (Murder) చేసిన కేసును నాచారం (Nacharam) పోలీసులు ఛేదించారు. ఇప్పటికే నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి తెలుసుకున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదిలో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో మామిడికుదురు సమీపంలోని వైనతేయ గోదావరి నుంచి హతురాలు మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు.
రెండు నెలల క్రితమే కిరాయికి..
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ బాబానగర్‌లో సూరెడ్డి సుజాత (65) ఒంటరిగా నివసిస్తున్నారు. భర్త, కుమారులు చనిపోవడంతో ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పెరవలి మండలం కొత్తపల్లికి చెందిన ఎం. అంజిబాబు (33) డ్రైవర్ పని నిమిత్తం నగరానికి వచ్చి, సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఆమె ఒంటిపై పదకొండు తులాల బంగారం చూసి ఎలాగైనా దానిని దక్కించుకోవాలని పథకం వేశాడు. ఈ నెల 19న రాత్రి ఆమెను హత్య చేసి, ఒంటిపై ఉన్న 11 బంగారాన్ని తీసుకుని, మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టి తాళం వేశాడు.
మృతదేహాన్ని తీసుకెళ్లి గోదావరిలో విసిరివేత
హత్య విషయాన్ని తన స్నేహితులైన పెరవలి మండలం కందవల్లికి చెందిన యువరాజు (18), అమలాపురం మండలం వేమవరానికి చెందిన దుర్గారావు (35)లకు చెప్పి, తన సొంతూరుకు వెళ్లాడు. తెల్లవారి ఆ ముగ్గురూ కలిసి కారును కిరాయికి తీసుకుని మల్లాపూర్ చేరుకున్నారు. మృతదేహాన్ని ఒక సూట్‌కేసులో పెట్టి, కారులో కోనసీమ జిల్లాలోని కృష్ణలంకకు తరలించి, గోదావరిలో విసిరేశారు. మొయినాబాద్‌లో ఉంటున్న సుజాత చెల్లెలు సువర్ణలత ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఇంటికి వచ్చింది. ఇళ్లు తాళం వేసి ఉండడంతో తన అక్క కనిపించడం లేదని నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న అంజిబాబు కనిపించకడం లేదని గుర్తించిన పోలీసులు తీగ లాగారు. అంజిబాబును పట్టకుని విచారించగా నేరం అంగీకరించారు. అనంతరం మిగిలిన నిందితులను సైతం అదుపులోకి తీసుకుని, మృతదేహం కోసం గాలింపు ప్రారంభించారు. మృతదేహం లభ్యం కావడంతో నిందుతులను న్యాయస్థానంలో హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





