త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MP Vaddhiraju Ravichandra | 311 మందికి కాదు.. 700 కుటుంబాల‌కు ప‌ట్టాలివ్వాలి..

వెలుగుమట్ల (Velugumatla) బాధితులందరికీ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddhiraju Ravichandra) స్పష్టం చేశారు. కేవలం 311 మందికి పట్టాలిచ్చి (Land titles) చేతులు దులుపుకుంటే సరిపోదని, నిరాశ్రయులైన 700 కుటుంబాలకు స్థలాలు ఇవ్వాల‌న్నారు.

S

News | Published On Mar 11, 2026, 6.18 pm IST

MP Vaddhiraju Ravichandra | 311 మందికి కాదు.. 700 కుటుంబాల‌కు ప‌ట్టాలివ్వాలి..
Advertisement

- వెలుగుమ‌ట్ల‌ బాధితులందరికి న్యాయం జరగాల్సిందే
- ఎంపీ వద్దిరాజు ర‌విచంద్ర‌

త్రినేత్ర‌.న్యూస్‌: వెలుగుమట్ల (Velugumatla) బాధితులందరికీ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (MP Vaddhiraju Ravichandra) స్పష్టం చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఖమ్మం నగర శివార్లలోని 60 ఎకరాల భూదాన్ భూము (Bhudaan lands) ల్లో 700 కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవ‌నం కొన‌సాగిస్తుండ‌గా అందులో కేవలం 311 మందికే పట్టాలివ్వడం (Land titles) అభ్యంతరకరమన్నారు. ప్రభుత్వం అనాలోచిత చర్యతో రోడ్డునపడ్డ బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించార‌న్నారు. వారికి మనోధైర్యాన్నిచ్చి కొండంత అండగా నిలిచారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.

నిరాశ్రయులైన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ (SC, ST, BC, Minority) వర్గాలకు చెందిన వారేనని వాపోయారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో తాగునీరు, భోజన వసతి కల్పించిన‌ట్లు తెలిపారు. బాధితులకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) అండగా నిలిచి పోరాడడంతో ప్రభుత్వం దిగొచ్చి పట్టాలిచ్చేందుకు ముందుకు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కేవలం 311 మందికి పట్టాలిచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నిరాశ్రయులైన 700 కుటుంబాలకు స్థలాలు ఇవ్వాల‌న్నారు. ఇంతేకాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూల్చివేతల సందర్భంగా పక్కా గృహాలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని కోరారు. వెలుగుమట్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement