Koppula Eshwar | జీవన్‌రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణ బలోపేతం: కేసీఆర్ సభా స్థలి పరిశీలనలో కొప్పుల
Jeevan Reddy | జగిత్యాల(Jagtial)లో ఈనెల 20న నిర్వహించనున్న కేసీఆర్ సభా స్థలాన్ని(KCR Meeting place) మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar), జీవన్ రెడ్డి (Jeevan Reddy), జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ కలిసి శనివారం పరిశీలించారు. జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని కొప్పుల అన్నారు.
నేత్ర.న్యూస్: జగిత్యాల(Jagtial)లో ఈనెల 20న నిర్వహించనున్న కేసీఆర్ సభా స్థలాన్ని(KCR Meeting place) మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar), జీవన్ రెడ్డి (Jeevan Reddy), జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ కలిసి శనివారం పరిశీలించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డులో దాదాపు లక్ష మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఇటీవలే జీవన్‌రెడ్డి పేర్కొన్న విషయం విదితమే. ఇక్కడ నిర్వహించే సభ సందర్భంగానే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటిని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని వెల్లడించారు. జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. జగిత్యాల సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత సురేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమా, DCMS మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



