Telangana Budget | స్కీమ్‌ల బడ్జెట్ కాదు.. ఇది స్కామ్‌ల బడ్జెట్: ప్రశాంత్‌రెడ్డి
Telangana Budget | పేద ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను వంచించేలా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ (Budget)ను ప్రవేశపెట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) విమర్శించారు. స్కీమ్‌ల బడ్జెట్ లా కాకుండా స్కామ్‌ల బడ్జెట్ (Scam's Budget) లా ఉందని ఆరోపించారు.
- అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం
- మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులకు అన్యాయం
- ఆరు గ్యారంటీలకు మంగళం
- పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
త్రినేత్ర.న్యూస్: పేద ప్రజలను, మహిళలను, నిరుద్యోగులను వంచించేలా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ (Budget)ను ప్రవేశపెట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) విమర్శించారు. స్కీమ్‌ల బడ్జెట్ లా కాకుండా స్కామ్‌ల బడ్జెట్ (Scam's Budget) లా ఉందని ఆరోపించారు. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ అదే అంకెల మాయాజాలంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు అయినా ఇంకా ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదన్నారు.
ప్రజలకు పనికొచ్చే స్కీంలకు కేటాయింపులు లేవని.. కానీ స్కామ్ లు చేసే ప్రాజెక్ట్ లకు కేటాయింపులు చేశారని మండిపడ్డారు. కోటి 58 లక్షల మహిళలకు ఇస్తానన్న రూ.2500 చేయూత పథకం ప్రస్తావనే లేదన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు పెన్షన్‌ను రూ.2000 నుంచి రూ.4000కి పెంపుపై కేటాయింపులు లేవని పేర్కొన్నారు. తులం బంగారం హామీ పూర్తిగా మర్చిపోయారని మండిపడ్డారు.
రాజీవ్ యువ వికాసం ఆచరణ సాధ్యమేనా?
జాబ్ క్యాలెండర్ ను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పూర్తి కాలేని రుణమాఫీపై స్పష్టత లేదన్నారు. “రైతు భరోసా” పేరుతో హామీలు ఇచ్చినా ఇప్పటివరకు మూడు పంటలకు ఎగ్గొట్టారని ఫైరయ్యారు. ఆచరణకు సాధ్యం కానీ రాజీవ్ యువ వికాసానికి మాత్రం బడ్జెట్ లో ప్రతిసారి కేటాయింపులు చేస్తూ వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో ఈ బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ.. ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదన్నారు. తెలంగాణ ప్రజలను పూర్తిగా వంచించే బడ్జెట్‌గా నిలిచిందని.. ఈ బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని ఎమ్మెల్యే వేముల విమర్శించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





