త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KP Vivekananda | నిధుల్లేవ్‌, విధుల్లేవ్‌.. 99 రోజుల కార్య‌క్ర‌మం ఒట్టి భూట‌కం: బీఆర్ఎస్ శాస‌న స‌భ విప్ కేపీ వివేకానంద‌

KP Vivekananda | 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి నివేదిక (Praja Palana- Pragathi Nivedika) కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవని.. అదంతా భూట‌క‌మ‌ని బీఆర్ఎస్ శాస‌న స‌భ విప్ కేపీ వివేకానంద విమ‌ర్శించారు. రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో ప్రజలను వంచించే కాలం నడుస్తోంద‌న్నారు.

S

News | Published On May 2, 2026, 4.14 pm IST

KP Vivekananda | నిధుల్లేవ్‌, విధుల్లేవ్‌.. 99 రోజుల కార్య‌క్ర‌మం ఒట్టి భూట‌కం: బీఆర్ఎస్ శాస‌న స‌భ విప్ కేపీ వివేకానంద‌
Advertisement

- ప్ర‌భుత్వం ఉన్న‌ద‌ని చెప్పుకోవ‌డానికే ఈ కార్య‌క్ర‌మం
- అందులో ప్ర‌జ‌ల‌కు చేసిందేం లేదు
- క‌విత ఎవ‌రి చేతిలో కీలుబొమ్మ‌నో ప్ర‌జ‌ల‌కు తెలుసు
- ఆమెకు కేసీఆర్ ఇచ్చిన అవ‌కాశాలు అనేకం
- తెలంగాణ‌కు ఎప్ప‌టికీ బీఆర్ఎస్సే శ్రీ‌రామ‌ర‌క్ష‌
- మీడియా స‌మావేశంలో శాస‌న‌స‌భ విప్‌ కేపీ వివేకానంద‌

KP Vivekananda | త్రినేత్ర‌.న్యూస్‌: 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి నివేదిక (Praja Palana- Pragathi Nivedika) కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవని.. అదంతా భూట‌క‌మ‌ని బీఆర్ఎస్ శాస‌న స‌భ విప్ కేపీ వివేకానంద విమ‌ర్శించారు. కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం ఉంద‌ని చెప్పడానికి తప్ప ఇందులో ప్రజలకు చేసేది ఏం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో ప్రజలను వంచించే కాలం నడుస్తోంద‌న్నారు.

హామీలపై స‌మీక్ష‌లు చేసుకోండి..

ప్రజా పాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమం అన్నారు. అందులో భాగంగా 60 రోజులు కావస్తుంది. మొదటి దఫా తీసుకున్న దరఖాస్తుల‌తోనే కాలం గడిపారు. గతంలో పెన్షన్ కోసం, ఇండ్ల కోసం, స్థానిక సమస్యల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు అమలు అటుంచితే ఉన్న పథకాలు కూడా అమలు చేయడం లేదు. ఏ ఒక్క వర్గానికీ మంచి చేయడం లేదు. ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది. 99 రోజుల ప్రణాళిక కాదు 900 రోజుల్లో కూడా ఎలాంటి హామీలు అమలు చేయలేదు. చేయని హామీల‌పై ఒక్కసారైనా సమీక్ష చేసుకున్నారా అని వివేకానంద ప్ర‌శ్నించారు.

ముఖ్యమంత్రి.. మీ శాఖ దుస్తితి ఘోరంగా ఉన్నది. రాష్ట్రంలో ఇవాళ తాగు నీరు లేక బిందెలతో రోడ్డెక్కుతున్నారు.
గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వకపోతే ఓట‌డగను అని చెప్పిన నాయకుడు కేసీఆర్.
నీళ్లు ఇచ్చాకే ఓట్లు అడిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. ప‌ట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్య‌క్ర‌మాల‌తో అద్భుత ప్ర‌గ‌తిని సాధించాం అని ఆయ‌న గుర్తు చేశారు.

బ‌లిసినోళ్ల‌కే ఇందిర‌మ్మ ఇండ్లు..

ఇవాళ విద్యా శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉన్నది. అంత అయోమయం ఆగమాగం. హోంశాఖ సీఎం వద్దనే ఉన్నది. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో అందరికీ తెలుసు ఇగ‌. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా గందరగోళమే. ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు ఇస్తున్నారు. స్వయంగా మంత్రి ముందే నా కొడుకు లండన్ లో ఉన్నాడు, నా బిడ్డ ప్రభుత్వ ఉద్యోగి అని ఓ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చెప్పింది. కాంగ్రెస్ పాల‌న ఎలా ఉందో చెప్ప‌డానికి ఇదే ప్ర‌త్యక్ష ఉదాహ‌ర‌ణ అని కేపీ వివేకానంద‌ ఎద్దేవా చేశారు.

మనుషులు లేని దగ్గర భవిష్యత్తు నగరం అంటూ అన్ని అక్కడే చేస్తున్నాడు. రాష్ట్రంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా సరిగా లేక విద్యుత్ నియంత్రిక‌లు పేలిపోతున్నాయి. రాజీవ్ యువ వికాసం ప్రకటించి సంవత్సరం అయింది. ఒక్కరికైనా అందిందా. రైతు భరోసా, రైతు బీమా ఇందిరమ్మ ఇండ్లు ఏది తీసుకున్న అరకొర తప్ప ఏదీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు అని ఆయ‌న మండిప‌డ్డారు.

క‌విత వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ చీత్క‌రించుకుంటుంది..

కేటీఆర్ తో ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. Sir పై, ఓటర్ నమోదు, పార్టీ సభ్యత్వం పై, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డిక్లరేషన్ పై కూడా చర్చించాం. కేసీఆర్ అంటే సదా సీదా నాయకుడు కాదు. 14 యేండ్ల పాటు ఉద్యమం నడిపి తెలంగాణ సాధించిన నాయకుడు. తెలంగాణ సాధించిన కీర్తి కేసీఆర్ ది. కేసీఆర్ ను తెలంగాణ సమాజం మొత్తం పెద్ద దిక్కుగా భావిస్తారు. కేసీఆర్ పై కవిత చేసిన వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ సమాజం చీత్కరించుకుంటుంది. ఆమె విలువలను కోల్పోయారు. వ్యవహార శైలి తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుంది. కవిత ఎవరిచేతిలో కీలుబొమ్మనో ప్రజలకు అర్థమైంది. రాజకీయంగా కేసీఆర్ అనేక అవకాశాలిచ్చారు. ఆమె రాజకీయ నాయకురాలిగా పనికిరారు అని కేపీ వివేకానంద విమ‌ర్శించారు.

Advertisement
Advertisement