త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Goa | గోవానైట్ క్ల‌బ్‌ను కూల్చివేయాల‌ని ఆదేశించిన ప్ర‌భుత్వం

Goa | గోవా(Goa)లో జ‌రిగిన అగ్నిప్ర‌మాద (Fire Accident) ఘ‌ట‌న చోటు చేసుకున్న రోమియో లేన్ (Romeo Lane) నైట్ క్ల‌బ్‌ (Night Club) ను కూల్చివేయాల‌ని ముఖ్య‌మంత్రి (CM) ప్ర‌మోద్ సావంత్ ఆదేశాలు జారీ చేశారు.

A

News | Published On Dec 9, 2025, 3.04 pm IST

Goa | గోవానైట్ క్ల‌బ్‌ను కూల్చివేయాల‌ని ఆదేశించిన ప్ర‌భుత్వం
Advertisement

Goa | గోవా (Goa)లో ఆర్పొరాలో అగ్నిప్ర‌మాదం (Fire Accident) జ‌రిగి 25 మంది మృతి చెందిన ఘ‌ట‌న‌లో రోమియో లేన్ (Romeo Lane) నైట్ క్ల‌బ్‌ (Night Club) ను త‌క్ష‌ణ‌మే కూల్చివేయాల‌ని (Demolition) రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఈ క్ల‌బ్‌ అక్ర‌మ నిర్మాణం, అవ‌స‌ర‌మైన లైసెన్స్‌లు లేక‌పోవ‌డం, కోస్ట‌ల్ రెగ్యులేష‌న్ జోన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం వంటి తీవ్ర‌మైన ఉల్లంఘ‌న‌ల‌తో న‌డుస్తోందని అధికారుల ద‌ర్య‌ప్తులో తేలింది. గ‌తంలో స్థానిక పంచాయ‌తీ, కోర్టులు ముందే కూల్చివేయాల‌ని నోటీసులు ఇచ్చినా, అప్పీలు, స్టే ఆర్డ‌ర్ల కార‌ణంగా నైట్ క్ల‌బ్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని తేల్చారు. అగ్నిప్ర‌మాదం నేప‌థ్యంలో మ‌రో ప్ర‌దేశంలోని రోమియో లేన్ క్ల‌బ్‌కు కూడా సీల్ చేసి, కూల్చివేయాల‌ని ముఖ్య‌మంత్రి (CM) ప్ర‌మోద్ సావంత్ ఆదేశించారు. రోమియోలేన్ పేరుతో ఉన్న అన్ని ప్రాంగ‌ణాల‌ను అధికారులు ఇప్ప‌టికే మూసివేయించారు. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement