త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amrit Bharat Train | ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌..! చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కామాఖ్య‌కు అమృత్ భార‌త్ రైలు..!

Amrit Bharat Train | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భార‌తీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అసోంలోని ప్ర‌ముఖ శ‌క్తిపీఠ క్షేత్ర‌మైన కామాఖ్య వ‌ర‌కు అమృత్ భార‌త్ రైలును న‌డిపించ‌నున్న‌ది. ఈ రైలును ఈ నెల 13న కామాఖ్య నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే మంగ‌ళ‌వారం తెలిపింది.

P

News | Published On Mar 10, 2026, 4.33 pm IST

Amrit Bharat Train | ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌..! చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కామాఖ్య‌కు అమృత్ భార‌త్ రైలు..!
Advertisement

Amrit Bharat Train | తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భార‌తీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. అసోంలోని ప్ర‌ముఖ శ‌క్తిపీఠ క్షేత్ర‌మైన కామాఖ్య వ‌ర‌కు అమృత్ భార‌త్ రైలును న‌డిపించ‌నున్న‌ది. ఈ రైలును ఈ నెల 13న కామాఖ్య నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే మంగ‌ళ‌వారం తెలిపింది. ఈ రైలు చ‌ర్ల‌ప‌ల్లి రైల్వేస్టేష‌న్ నుంచి అసోంలోని కామాఖ్య వ‌ర‌కు రాక‌పోక‌లు సాగిస్తుంద‌ని పేర్కొంది. ఉత్తర–తూర్పు ప్రాంతంలోని “సెవెన్ సిస్టర్స్” రాష్ట్రాలకు ఎంట్రీ గేట్‌గా ఉన్న అసోంకు వెళ్లే ప‌ర్యాట‌కుల‌కు ఈ రైలు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌నున్న‌ది. ఈ రైలు సుదీర్ఘ దూరం న‌డించే ఈ రైలు ప్ర‌యాణికుల‌కు సుర‌క్షిత‌, సౌక‌ర్య‌వంత‌మైన‌, త‌క్కువ ఖ‌ర్చుతోనే మెరుగైన ప్ర‌యాణాన్ని అందిస్తుంద‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఏపీలోని శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం జంక్షన్‌, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్‌, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్‌, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది.

చర్లపల్లి టెర్మినల్‌ స్టేషన్‌ను గత ఏడాది జనవరిలో ప్రారంభించింది. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించ‌గా.. ఈ స్టేషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌కు ఐదో టెర్మినస్‌గా నిలిచింది. ఇప్పటికే నాంపల్లి, సికింద్రాబాద్‌, కాచిగూడ, లింగంపల్లి టెర్మిన‌ల్స్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవలే తమిళనాడులోని నాగర్‌కోయిల్‌ నుంచి చర్లపల్లి వరకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య రవాణా సౌక‌ర్యం పెరుగుతుంద‌ని, లోక‌ల్ ఎకాన‌మీ, టూరిజం సైతం పెరుగుతోంద‌ని పేర్కొంది. ఈ రైలు సుమారు 1500 కిలోమీటర్లకుపైగా దూరాన్ని 28 నుంచి 30 గంటల్లో కవర్‌ చేసే అవ‌కాశం ఉంది. ఈ రైలు మదురై జంక్షన్‌, తిరుచ్చిరాపల్లి, తిరుపతి వంటి కీల‌క స్టేష‌న్ట‌ల‌లో ఆగుతుంది.

భార‌తీయ రైల్వే తీసుకువ‌చ్చిన అమృత్ భార‌త్ రైలుకు ప్ర‌యాణికుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ ఆధునిక రైళ్లు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ దేశీయ రైల్వే వ్యవస్థ ఆధునికీకరణకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ రైళ్లలో సెమీ ఆటోమేటిక్ కప్లర్లు, అగ్ని గుర్తింపు వ్యవస్థలు, సీల్డ్ గ్యాంగ్‌వేలు, టాక్‌బ్యాక్ యూనిట్లు త‌దిత‌ర ఆధునిక సౌకర్యాలు క‌ల్పించారు. ముఖ్యంగా తొలిసారిగా నాన్ ఏసీ బోగీల్లోనూ అధునాతన భద్రతా సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు రైల్వే అధికారులు వివ‌రించారు.

Advertisement
Advertisement