CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సూచనల మేరకే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రైతులను రెచ్చగొడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు యత్నించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సూచనల మేరకే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రైతులను రెచ్చగొడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు యత్నించారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్ అంటే తమకు గౌరవం కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను గౌరవించే పరిస్థితి లేదని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని బోధి పెవిలియన్‌లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రధానంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ వాళ్లు, నిన్న ఇవాళ బీజేపీ నాయకులు గోదావరి జలాల మీద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కరువు పరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో వర్షాల వల్ల గోదావరిలో నీళ్లు ఎత్తిపోయాలని, రైతులను ఆదుకోవాలని, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని బురదజల్లే ప్రయత్నం వేగంగా జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ నేతలు ఈ ప్రయత్నం చేసి ఉంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. వారి మాటలను సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రిటైర్డ్ ఇంజినీర్ల ముసుగులో బీఆర్ఎస్ రాజకీయ వాదనను ముందు పెట్టి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ వాదనను తీసుకుని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తక్షణమే గోదావరి జలాలను కన్నెపల్లి పంప్ ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఈటల పట్ల మాకు తక్కువ అభిప్రాయం కానీ, ఇతర అభిప్రాయాలేం లేవు. ఆయనంటే గౌరవమే కానీ ఆయన మాటలను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. వారు మాట్లాడే ముందు సంబంధిత శాఖ మంత్రితో, లేకపోతే ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ప్రభుత్వానికి సూచన చేసి ఉంటే గౌరవం పెరిగి ఉండేది. ఎవరితో ప్రస్తావించకుండా హరీశ్ సూచనల మేరకు ఈటల మాట్లాడడం వల్ల వారి గౌరవం, మర్యాదను పొగొట్టుకున్నారు. రిటైర్డ్ ఇంజినీర్ల ముసుగులో బీజేపీ, బీఆర్ఎస్ ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలను వివరిస్తే.. ప్రజలకు తెలుస్తుంది అని చెప్పి అత్యవసరంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు
జులై 11, 2026

Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
జులై 11, 2026

CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
జులై 11, 2026
తాజావార్తలు
- ●Anirudh - Kavya Maran | అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా?
- ●Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం
- ●CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!
- ●Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు
- ●Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు

Anirudh - Kavya Maran | అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా?

Harish Rao | షాబాద్ హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.. పోలీసుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం

CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!



