Ntr Vs Dhanush | ఎన్టీఆర్‌కు ధనుష్ కౌంటర్ – గాడ్ ఆఫ్ వార్‌కు పోటీగా మైథాలజీ మూవీ అనౌన్స్ – ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్
ఇటీవలే యుద్ధ దేవుడైన కుమారస్వామి కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఓ మైథాలజీమూవీని అనౌన్స్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌కుపోటీ తమిళ హీరో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి తమిళ మురుగన్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఎన్టీఆర్, ధనుష్ సినిమాలను కంపేర్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 11, 2026, 10.27 am IST
Ntr Vs Dhanush | ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మైథాలజీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. యుద్ధ దేవుడిగా పురాణాలు పేర్కొన్న కుమారస్వామి కథతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మైథాలజీ మూవీకి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడు. ఓ పోస్టర్ ద్వారా ఈ పాన్ ఇండియన్ మూవీని అనౌన్స్‌చేశారు. అనౌన్స్‌మెంట్‌తోనే ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌పై దారుణంగా విమర్శలు వచ్చాయి. ఈ పోస్టర్‌లో కుమారస్వామి ఉత్తరాదిన పుట్టి దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నడంపై తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారస్వామి తమిళనాడు దేవుడు అంటూ పోస్ట్‌లు, ట్వీట్స్ పెట్టారు. పురాణాలను వక్రీకరిస్తే ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. ఈ సినిమాను ఆపేయాలంటూ వార్నింగ్‌లు కూడా ఇచ్చారు.
తమిళ మురుగన్...
తాజాగా ఎన్టీఆర్‌కు తమిళ హీరో ధనుష్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీకి పోటీగా కుమారస్వామి కథతో ఓ సినిమాను అనౌన్స్‌చేశాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు తమిళ మురుగన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం ఈ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఏనుగుపై ఈటె పట్టుకొని తన సైన్యంతో యుద్ధ క్షేత్రానికి వస్తోన్న వీరుడిగా ధనుష్ కనిపిస్తున్నారు. మురుగన్.... తమిళ ప్రజల రక్షకుడు, యోధుడు, నాయకుడు అంటూ ఈ వీడియో గ్లింప్స్‌కు ధనుష్ క్యాప్షన్ జోడించారు. పురాణాలతో ముడిపడిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు వీడియో గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇందులో హీరోగా నటిస్తూనే ఈ సినిమాను ధనుష్ స్వయంగా నిర్మిస్తున్నాడు.
కంపేరిజన్స్...
తమిళ మురుగన్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్, క్యాప్షన్ చూస్తుంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీకి ఈ తమిళ సినిమా కథ దగ్గరగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రెండింటిని కంపేర్ చేస్తూ నెటిజన్లు పలు ట్వీట్స్, పోస్ట్‌లు పెడుతున్నారు. ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ ధనుష్ ఈ సినిమాను అనౌన్స్‌చేశాడని అంటున్నారు. మురుగన్ ఉత్తరాదిలో పుట్టలేదని, తమిళనాడు చెందిన దేవుడే అని చెప్పడానికే ధనుష్, వెట్రిమారన్ ఈ కోలీవుడ్ మూవీని చేస్తున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. తెలుగు సినిమాకు వస్తోన్న పేరు ప్రఖ్యాతులు, విజయాలు చూసి తమిళ ప్రజలు జెలసీగా ఫీలవుతున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. తమిళ సినిమాలను తెలుగులో బ్యాన్ చేయలని అంటున్నారు.
లార్గ్ మురుగన్‌పై ధనుష్‌తో పాటు శివకార్తికేయన్ కూడా సియోన్ అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. మురుగన్‌పై ముగ్గురు స్టార్ హీరోలు ఒకేసారి సినిమా చేయడం ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TRAI | 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..
- ●Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు
- ●Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత
- ●Lenin Collections | లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్ - అఖిల్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ - పదకొండేళ్ల రికార్డ్ బ్రేక్
- ●India-New Zealand | 2030 నాటికి రూ.35వేల కోట్ల వాణిజ్యం.. న్యూజిలాండ్‌తో కుదిరిన డీల్
- ●ISKCON vs Puri Temple | ఇస్కాన్ వర్సెస్ పూరీ శ్రీమందిరం: విదేశాల్లో జగన్నాథుని రథయాత్ర తేదీలపై ఎందుకీ వివాదం?

TRAI | 1600, 140 సిరీస్ ఫోన్ నంబర్లపై ట్రాయ్ క్లారిటీ.. అసలు సమస్యపై మాత్రం మౌనం..

Donald Trump | నన్ను హతమారిస్తే.. ఇరాన్ బూడిదవక తప్పదు.. ట్రంప్ హెచ్చరికలు

Kavitha | రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఉందా?.. రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: కవిత

Lenin Collections | లెనిన్ ఫస్ట్ డే కలెక్షన్స్ - అఖిల్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ - పదకొండేళ్ల రికార్డ్ బ్రేక్






