Electronic Service Delivery | ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం.. ప్రైవేట్ సంస్థపై కేసు
Electronic Service Delivery | మ్మకద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్ హ్యాండోవర్‌కు అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) పైవేట్ లిమిటెడ్ (Transaction Analysts India Pvt Ltd) తో పాటు ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరి(Srinivasa Rao Katuri) పై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఐటీ & కమ్యూనికేషన్స్ శాఖలోని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం చర్యలకు దిగింది.
- నిబంధనలు ఉల్లంఘించిన ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) పైవేట్ లిమిటెడ్
- కాలపరిమితి ముగిసినా కొత్త సంస్థకు డేటా బదిలీ చేయకుండా అడ్డంకులు
- పరారీలో సంస్థ ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరి, ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్
- సీసీఎస్ లో కేసు నమోదు, పట్టుకునేందుకు పోలీసుల గాలింపు
Electronic Service Delivery | త్రినేత్ర.న్యూస్: నమ్మకద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్ హ్యాండోవర్‌కు అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) పైవేట్ లిమిటెడ్ (Transaction Analysts India Pvt Ltd) తో పాటు ఎండీ, సీఈవో శ్రీనివాసరావు కాటూరి(Srinivasa Rao Katuri) పై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఐటీ & కమ్యూనికేషన్స్ శాఖలోని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం చర్యలకు దిగింది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) పైవేట్ లిమిటెడ్ పై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కేసు పెట్టింది.
ఇదీ కేసు నేపథ్యం..
ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) పైవేట్ లిమిటెడ్ సంస్థను 2017, జనవరిలో రాష్ట్రానికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, నిర్వహణ కోసం నియమించారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ప్రభుత్వం సుమారు రూ. 70 లక్షలు చెల్లించింది. అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతినెలా నిర్వహణ చార్జీలూ అందజేసింది. ఒప్పంద నిబంధనల ప్రకారం కాలపరిమితి ముగిసిన తరువాత ప్రాజెక్టు మొత్తం డేటా, సోర్స్ కోడ్ తో పాటు డిజిటల్ ఆస్తులపై పూర్తి హక్కులు తెలంగాణ ప్రభుత్వానికే చెందాలి. అయితే మూడు సార్లు (2018-25 వరకు) అవే నిబంధనలతో పని కొనసాగించింది. కాలపరిమితి 2025, మే 31తో ముగియగా కొత్త సంస్థ ఎంపిక కోసం టెండర్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. దీనిలో పర్వూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్సీసెస్ కంపెనీ (Purview India Consulting and Services LLP) సంస్థ ఎల్ 1 గా ఎంపికైంది. ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ కూడా ఈ టెండర్‌లో పాల్గొని, నిబంధనలకు ఒప్పుకొంది. టెండర్‌లో విఫలమైన తర్వాత సహకరించకుండా వ్యవహరించడం ప్రారంభించింది.
ఎం.శ్రీనివాసులు అరెస్టు..
తప్పుడు యాజమాన్య పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి చెందిన డేటాను తమదేనని చెప్పే ప్రయత్నం చేసింది. కొత్త సంస్థకు హ్యాండోవర్ చేసేందుకు పదే పదే అడ్డుపడింది. నిధుల దుర్వినియోగంతో పాటు, యూజర్ డేటాను తమ ప్రైవేట్ అప్లికేషన్‌కు మళ్లించే ప్రయత్నం చేసింది. వీటిపై ప్రభుత్వం మండిపడుతూ ప్రజా ఆస్తులను రక్షించేందుకు, చట్టపరమైన చర్యలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సీసీఎస్ లో కేసు దాఖలు చేసింది.
దీంతో సంస్థకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులందరికీ నోటీసులు జారీ చేశారు. చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాసులును ఏప్రిల్ 25న పోలీసులు అరెస్ట్ చేశారు. సంస్థ ఎండీ, సీఈవో శ్రీనివాస రావు కాటూరి, ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉండగా వారికి కోసం గాలిస్తున్నట్లు ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ కు చెందిన ఏసీపీ ఏ రామ్ రెడ్డి తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు..
ఈ విషయాన్ని ఐటీ శాఖ ప్రభుత్వానికి నివేదించగా ఒప్పంద నిబంధనల ప్రకారం జరిమానాలు విధించడం, భవిష్యత్ టెండర్ల నుంచి బ్లాక్‌లిస్టింగ్ చేయడం, నష్టపరిహారం వసూలు చేయడం లాంటి చర్యలు ట్సాన్సాక్షన్స్ సంస్థపై పరిశీలనలో ఉన్నాయని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాలను దెబ్బతీసే ఎలాంటి సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



