Ponnam Prabhakar | రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించేలా అవగాహన కల్పిస్తున్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. విద్యార్థులకు వారి తల్లిదంత్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకుంటుందని చెప్పారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి, మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. విద్యార్థులకు వారి తల్లిదంత్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకుంటుందని చెప్పారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞా వెబ్సైట్‌ను (Road Safety Pledge) రవాణా శాఖ ప్రారంభించిందని వెల్లడించారు. సచివాలయంలోని తన చాంబర్‌లో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌ను (Prathigna Website) మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రతిజ్ఞ రాబోయే కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి కారణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల వద్ద అగ్రిమెంట్ ద్వారా విద్యార్థులతో ఉన్న వారి బాండింగ్‌తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆకాక్షించారు. ఇది ఆన్‌లైన్‌లో, క్షేత్ర స్థాయిలో ప్రతి మోటార్ వెహికిల్ ఉన్న వారి దగ్గరకు పెద్ద ఉద్యమంగా రవాణా శాఖ అధికారులు తీసుకుపోవాలని సూచించారు.

ప్రతిజ్ఞ వెబ్‌సైట్
తెలంగాణలో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన సంస్కృతిని నిర్మించే దిశగా రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్ ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. పౌరులు, తల్లిదండ్రులను రోడ్డు భద్రతకు కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడం, ప్రాణాలను రక్షించడం ఉమ్మడి బాధ్యత అని, సురక్షితమైన అలవాట్లు ఇంట్లోనే ప్రారంభమై ప్రతి రహదారిపై కొనసాగుతాయని గుర్తించడం రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు వినియోగదారుల్లో క్రమశిక్షణ, అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రోత్సహించే దార్శనికతను ఇది పునరుద్ఘాటిస్తుంది. పౌరులు ట్రాఫిక్ నియమాలను పాటించడానికి, రోడ్డుపై ఉన్న ప్రతి జీవితాన్ని గౌరవించడానికి పౌర ప్రతిజ్ఞను తీసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడు నవీన్ పెట్టెం పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






