త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sai Pallavi | అఫీషియ‌ల్ : కొత్త మూవీ అనౌన్స్ చేసిన మ‌ణిర‌త్నం – సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌

థ‌గ్‌లైఫ్ డిజాస్ట‌ర్ త‌ర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ స‌స్పెన్స్‌కు తెర‌దించుతూ శుక్ర‌వారం కొత్త మూవీని మ‌ణిర‌త్నం అనౌన్స్‌చేశాడు.ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, సాయిప‌ల్ల‌వి హీరోయిన్లుగా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మ‌ణిర‌త్నం.

N

News | Published On Mar 20, 2026, 12.11 pm IST

Sai Pallavi | అఫీషియ‌ల్ : కొత్త మూవీ అనౌన్స్ చేసిన మ‌ణిర‌త్నం – సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌
Advertisement

Sai Pallavi |  విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేసి చాలా కాల‌మే అయ్యింది. ఒక‌ప్పుడు మ‌ణిర‌త్నం సినిమా అంటే ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ ఆడియెన్స్ సైతం ఆస‌క్తిగా ఎదురుచూసేవారు. ఆయ‌నతో సినిమా చేసే ఛాన్స్ కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురుచూసేవారు. వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో సీన్ మొత్తం మారిపోయింది. మ‌ణిర‌త్నం సినిమా అంటేనే స్టార్లు వెన‌క‌డుగు వేస్తున్నారు.

సైలెంట్‌గా....

క‌మ‌ల్‌హాస‌న్‌, మ‌ణిర‌త్నం కాంబినేష‌న్‌లో గ‌త ఏడాది రిలీజైన‌ థ‌గ్‌లైఫ్ దారుణంగా నిరాశ‌ప‌రిచింది. ఈ ఫెయిల్యూర్ త‌ర్వాత మ‌ణిర‌త్నం నెక్స్ట్ మూవీ ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న త‌దుప‌రి సినిమాను సైలెంట్‌గా అనౌన్స్‌చేసి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు మ‌ణిర‌త్నం.
విజ‌య్ సేతుప‌తితో నెక్స్ట్ మూవీ చేయ‌బోతున్నాడు మ‌ణిర‌త్నం. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ది.

ఆస్కార్ విన్న‌ర్‌....

శుక్ర‌వారం ఈ సినిమాను అధికారికంగా మ‌ణిర‌త్నం ప్ర‌క‌టించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మ‌ణిర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించ‌బోతున్నాడు.
మ‌ణిర‌త్నం గ‌త సినిమాల‌కు భిన్నంగా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొంద‌బోతున్న‌ట్లు స‌మాచారం. విజ‌య్ సేతుప‌తి, సాయిప‌ల్ల‌వి పాత్ర‌లు వైవిధ్యంగా సాగుతాయ‌ని అంటున్నారు. రొమాంటిక్ ల‌వ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

న‌వాబ్ త‌ర్వాత‌....

మ‌ణిర‌త్నం సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో ఇదే మొద‌టి మూవీ కాగా...విజ‌య్ సేతుప‌తితో ఈ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు చేస్తోన్న సెకండ్ సినిమా ఇది కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో చెక్కా చివంత వానం (తెలుగులో న‌వాబ్‌) మూవీ రూపొందింది. ఈ సినిమాకు అవార్డులు వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.

క‌ల్కి సీక్వెల్‌లో...

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి బాలీవుడ్‌లో ఏక్‌దిన్‌తో పాటు రామాయ‌ణ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. తెలుగులో ప్ర‌భాస్ క‌ల్కి 2లో సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నిర్మాత‌ల‌తో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా దీపికా ప‌దుకొనే ఈ సీక్వెల్ నుంచి త‌ప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో సాయిప‌ల్ల‌విని హీరోయిన్‌గా మేక‌ర్స్ ఫైన‌ల్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement