త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malladi Krishna Rao | ఏకైక‌ తెలుగు నియోజ‌క‌వర్గం యానాంలో మ‌ల్లాడి గెలుపు

Malladi Krishna Rao | కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి (Puducherry) లోని ఏకైక తెలుగు నియోజ‌క‌వ‌ర్గం యానాం(Yaanam) లో ఎన్నార్ కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్లాడి కృష్ణారావు విజ‌య ఢంకా మోగించారు. ఆయ‌న ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

S

News | Published On May 4, 2026, 2.08 pm IST

Malladi Krishna Rao | ఏకైక‌ తెలుగు నియోజ‌క‌వర్గం యానాంలో మ‌ల్లాడి గెలుపు
Advertisement

Malladi Krishna Rao | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరి (Puducherry) లోని ఏకైక తెలుగు నియోజ‌క‌వ‌ర్గం యానాం(Yaanam) లో ఎన్నార్ కాంగ్రెస్ అభ్య‌ర్థి మ‌ల్లాడి కృష్ణారావు విజ‌య ఢంకా మోగించారు. ఆయ‌న ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. దీంతో ఆయ‌న అభిమానులు, కుటుంబ స‌భ్య‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక

యానాంలో కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి 19,863, అశోక్‌కు 15,295 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయ‌న యానాం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

మ‌ల్లాడి 1964, జూన్ 6న‌ పుదుచ్చేరిలోని యానాంలో జ‌న్మించారు. అతను యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 25 సం.లు ఎమ్మెల్యేగా పనిచేసాడు. మూడు సార్లు ఉత్తమ ఎమ్మెల్యే పురస్కారం అందుకున్నారు. పేద, అనాథ బాలబాలిక విద్యార్థులకు ఉచిత విద్య, వసతి వంటి సౌక‌ర్యాలు క‌ల్పించి ప్ర‌జ‌ల మ‌న‌సును చూర‌గొన్నారు. న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మల్లాడి కృష్ణారావు 2011 సంవత్స‌రానికి శిశు సంక్షేమానికి జాతీయ అవార్డు, నగదు బహుమతిని అప్ప‌టి రాష్ట్రపతి ప్రణబ్ ముకర్జీ చేతుల మీదుగా అందుకున్నారు.

Advertisement
Advertisement