త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | 7 గంట‌ల‌కు కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని మోదీ

PM Modi | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల (Assembly Election Results) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal) చారిత్ర‌క విజ‌యం దిశ‌గా బీజేపీ (BJP) దూసుకెళ్తున్న‌ది. అస్సాంలో (Assam) అధికారాన్ని నిలుపుకున్న‌ది.

G

National | Published On May 4, 2026, 2.33 pm IST

PM Modi | 7 గంట‌ల‌కు కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల (Assembly Election Results) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. ప‌శ్చిమ బెంగాల్‌లో (West Bengal) చారిత్ర‌క విజ‌యం దిశ‌గా బీజేపీ (BJP) దూసుకెళ్తున్న‌ది. అస్సాంలో (Assam) అధికారాన్ని నిలుపుకున్న‌ది. ఇక పుదుచ్చేరిలో ఎన్‌డీఏ మ‌రోసారి సీఎం పీఠాన్ని ద‌క్కించుకోనుంది. దీంతో బీజేపీ వ‌ర్గాలు వేడుక‌లు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ (PM Modi) సోమ‌వారం సాయంత్రం 7 గంట‌ల‌కు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు.

126 స్థానాలున్న అస్సాంలో బీజేపీ 97 చోట్ల ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. ఇక 294 స్థానాలున్న బెంగాల్‌లో సువేందు అధికారి నేతృత్వంలోని 194 స్థానాల్లో లీడ్‌లో ఉన్న‌ది. దీంతో ఇరు రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిక్యంతో బీజేపీ అధికారం ద‌క్కించుకుంటున్న‌ది. సాయంత్రం వ‌ర‌కు ఫ‌లితాలు తేల‌నున్నాయి. ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాల్లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు సంబురాల్లో మునిగిపోయారు. అందులో ప్ర‌ధాని మోదీ కూడా భాగం కానున్నారు. ఈ క్ర‌మంలో కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు. ఎన్నిక‌ల్లో క‌ష్ట‌పడి ప‌నిచేసిన పార్టీ నాయ‌కులు, కార్య‌ర్త‌ల‌ను అభినందించ‌నున్నారు.

Advertisement
Advertisement