త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలో మ‌ల‌యాళం క్రైమ్ కామెడీ మూవీ ట్రెండింగ్ – నిత్య పెళ్లికూతురిగా హీరోయిన్‌

నిఖిలా విమ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ పెన్ను కేస్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రైమ్ కామెడీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం రిలీజైంది.

N

News | Published On Mar 12, 2026, 8.11 pm IST

Malayalam OTT |  ఓటీటీలో మ‌ల‌యాళం క్రైమ్ కామెడీ మూవీ ట్రెండింగ్ – నిత్య పెళ్లికూతురిగా హీరోయిన్‌
Advertisement

Malayalam OTT |  మ‌ల‌యాళం క్రైమ్ కామెడీ మూవీ పెన్ను కేస్ ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది. నిఖిలా విమ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. విడుద‌లైన మొద‌టిరోజే టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్‌లోకి వ‌చ్చింది.

సెకండ్ వీక్‌లో థియేట‌ర్ల‌లో...

ఈ క్రైమ్ కామెడీ మూవీకి ఫెబిన్ సిద్ధార్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అజు వర్గీస్, హకీమ్ షాజహాన్, రమేష్ పిషారోడి, ఇర్షాద్ అలీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి సెకండ్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో...

వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు పెన్నుకేస్ మూవీని తెర‌కెక్కించారు. పెళ్లిళ్ల పేరుతో అమాయ‌కుల‌ను కొంద‌రు ఎలా మోసం చేస్తున్నార‌న్న‌ది కామెడీని మేళ‌వించి ఈ మూవీలో థ్రిల్లింగ్‌గా చూపించారు డైరెక్ట‌ర్‌. ఈ సినిమాలో నిఖిలా విమ‌ల్ యాక్టింగ్, ఆమె కామెడీ టైమింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం యావ‌రేజ్‌గానే నిలిచింది.

నిత్య పెళ్లికూతురు...

రోహిణిది క‌ర్ణాట‌క, కేర‌ళ స‌రిహ‌ద్దుల్లోని ఓ ప‌ల్లెటూరు. తండ్రి చ‌నిపోవ‌డంతో కుటుంబం క‌ష్టాల్లో ప‌డుతుంది. అనుకోని ప‌రిస్థితుల్లో నిత్య పెళ్లికూతురిగా అవ‌తారం ఎత్తుతుంది. మారుపేర్ల‌తో కొంద‌రు యువ‌కుల‌ను పెళ్లిచేసుకొని ఫ‌స్ట్‌నైట్ రోజే న‌గ‌ల‌తో అక్క‌డి నుంచి జంపవుతుంటుంది. రోహిణి మోసాలు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాయి? నిత్య పెళ్లికూతురిగా ఆమె మార‌డానికి కార‌ణం ఏమిట‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.
మ‌ల‌యాళ హీరోయిన్ అయిన నిఖిలా విమ‌ల్ తెలుగులో సినిమాలు చేసింది. అల్ల‌రి న‌రేష్ మేడ‌మీది అబ్బాయితో పాటు మంచు మోహ‌న్‌బాబు, విష్ణు క‌లిసి న‌టించిన గాయ‌త్రిలో హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో సినిమాలు చేసింది.

Advertisement
Advertisement