Malayalam OTT | నిన్న థియేటర్లలో రిలీజ్…నెక్స్ట్ వీక్ ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ
మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ చథా పచ్చా థియేటర్లలో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. మలయాళంతో తెలుగులో రిలీజ్ అవుతుంది.
Malayalam OTT | ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చథా పచ్చా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ వారమే థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నెక్స్ట్ వీక్‌లో ఓటీటీలోకి రాబోతుంది. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ స్ఫూర్తితో యాక్షన్ కామెడీగా తెరకెక్కిన చథా పచ్చా థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 31 కోట్ల వసూళ్లతో 2026లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మలయాళ సినిమాగా నిలిచింది.
ఐదు భాషల్లో...
ఛథా పచ్చా మూవీ ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. చథా పచ్చా తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 13న థియేటర్లలో రిలీజైంది. తెలుగు వెర్షన్ విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానుండటం ఆసక్తికరంగా మారింది. చథా పచ్చా కు శంకర్ ఎహసాన్ లాయ్, ముజీబ్ మజీద్ మ్యూజిక్ అందించారు.
మమ్ముట్టి గెస్ట్ రోల్....
చథా పచ్చా కాన్సెప్ట్ రొటీన్ అయినా డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, హీరోల యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ యాక్షన్ కామెడీ మూవీలో మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. యాభై కోట్ల కలెక్షన్స్‌ను దాటుతుందని అనుకున్నారు. కానీ యాక్షన్ సన్నివేశాల్లో ఉన్న కొత్తదనం కథలో లేకపోవడంతో హిట్టుతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది.
చథా పచ్చా కథ ఇదే...
సవి, లిటిల్, వెట్రి ముగ్గురు అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వీరికి రెజ్లింగ్ అంటే పిచ్చి. ఆ అభిమానంతోనే పోర్ట్‌కొచ్ఛిలో డబ్ల్యూడబ్ల్యూఈ క్లబ్‌ను ఏర్పాటుచేస్తారు. వారి క్లబ్ ఫేమస్ అవుతుంది. లోకల్ గ్యాంగ్‌స్టర్‌తో ఈ ముగ్గురు అన్నదమ్ములకు గొడవలు మొదలవుతాయి? ఈ గ్యాంగ్‌స్టర్‌ను ఈ ముగ్గురు ఎలా ఎదురించారు? అన్నదే చథా పచ్చా మూవీ కథ.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






