Bihar | బీహార్‌లో నాయకత్వ మార్పు.. సీఎం ఎంపిక అప్పుడే!
Bihar | బీహార్(Bihar)లో నాయకత్వ మార్పు ప్రక్రియ వేగవంతమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) శాసనమండలికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్నిస్వీకరించారు. సీఎం ఎవరనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోగా సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ వంటి పేర్లు మాత్రం ప్రధాన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
త్రినేత్ర.న్యూస్: బీహార్(Bihar)లో నాయకత్వ మార్పు ప్రక్రియ వేగవంతమైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) శాసనమండలికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్నిస్వీకరించారు. ఈనెల 14న తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి 15న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. సీఎం ఎవరనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోగా సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ వంటి పేర్లు మాత్రం ప్రధాన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని, ఈనెల 13 తర్వాత ఆ కార్యాచరణ ప్రారంభమవుతుందని భావిస్తున్నట్లు జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఝా ఆదివారం చెప్పారు. నీతీశ్ కుమార్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరీ మాట్లాడుతూ.. బీజేపీ సిఫారసు మేరకు ఎన్డీఏ ఎమ్మెల్యేలు కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని చెప్పారు. బీజేపీ తమ ప్రణాళికతో ముందుకొస్తే తదుపరి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. బీజేపీ ముఖ్యమంత్రి పదవిని పొందే అవకాశాలున్నప్పటికీ, అభ్యర్థిని కేంద్ర నాయకత్వమే ఎంపిక చేస్తుందని చెప్పారు.
సీఎం రేసులో ఎవరంటే..
సీఎం రేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నీతీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Bandi Sanjay | బండి సంజయ్ .. ఎవరిని బెదిరిస్తున్నవ్ ?
మే 13, 2026

Bihar Cabinet Expansion | బీహార్‌లో కేబినెట్ విస్తరణ.. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ తనయుడు
మే 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



