త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | తెలంగాణ సత్తెమ్మ పాడె మోసిన కేటీఆర్

KTR | వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ (Telangana Satthemma) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర సంతాపం (condolence) వ్యక్తం చేశారు. ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు.

S

News | Published On Apr 19, 2026, 4.45 pm IST

KTR | తెలంగాణ సత్తెమ్మ పాడె మోసిన కేటీఆర్
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి చెందిన ఉద్యమకారిణి తెలంగాణ సత్తెమ్మ (Telangana Satthemma) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర సంతాపం (condolence) వ్యక్తం చేశారు. ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. స్వయంగా పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. ఆమె పోరాట ప‌టిమ‌ను స్మ‌రించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్ల‌డుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ అత్యంత చురుకైన పాత్ర పోషించార‌ని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో రోజూ పాల్గొంటూ "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత అని కొనియాడారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆమె చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ, రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Advertisement
Advertisement