త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

POCSO Case Judgment | కామాంధుడిని 20 ఏండ్లు జైల్లో ఉంచండి.. పోక్సో కేసులో కోర్టు కీల‌క‌ తీర్పు

POCSO Case Judgment | బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు షాద్‌నగర్ అరుణ్ (Arun) అలియాస్ నాని (23)కి 20 ఏళ్ల జైలు శిక్ష (Punishment) విధిస్తూ రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (Rangareddy fast track court) తీర్పునిచ్చింది. రూ.8,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ. 3,00,000 పరిహారం అందించాలని ఆదేశించింది.

S

News | Published On Apr 28, 2026, 11.54 am IST

POCSO Case Judgment | కామాంధుడిని 20 ఏండ్లు జైల్లో ఉంచండి.. పోక్సో కేసులో కోర్టు కీల‌క‌ తీర్పు
Advertisement

POCSO Case Judgment | త్రినేత్ర‌.న్యూస్‌: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సంచలనాత్మక రేప్, పోక్సో కేసులో (Cr.No. 193/2019) రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (Rangareddy fast track court) మంగ‌ళ‌వారం కీలక తీర్పు వెలువరించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు షాద్‌నగర్ అరుణ్ (Arun) అలియాస్ నాని (23)కి 20 ఏళ్ల జైలు శిక్ష (Punishment) విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు వివ‌రాల ప్ర‌కారం.. 2019, ఫిబ్ర‌వ‌రి 12న నిందితుడు అరుణ్ 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. యాదగిరిగుట్ట ఆలయానికి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై IPC సెక్షన్లు 366, 376(2)(i)(l), పోక్సో చట్టం సెక్షన్ 5(I) R/w 6 కింద కేసు నమోదు చేశామ‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేలుస్తూ 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.8,000 జరిమానా విధించార‌ని చెప్పారు. బాధితురాలికి రూ. 3,00,000 పరిహారం అందించాలని కోర్టు ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.

ఈ కేసులో అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారి కె.అశోక్ చక్రవర్తి (ఏసీపీ రాజేంద్రనగర్, రిటైర్డ్) సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, స్పెషల్ పీపీ బి.వెంకటేశ్వర్ రెడ్డి వాదనల‌తో నిందితుడికి శిక్ష పడటం ఖ‌రారైంది. ఇన్ స్పెక్టర్ కె. నాగేశ్వరరావు, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఎం.రవీందర్ (PC 4336), సమ్మన్స్ పీసీ ఎం.మధుకర్ (PC 10319), ఎస్సై కుమారి పి.పార్వతి ఈ కేసును తార్కిక ముగింపునకు తీసుకురావడంలో కృషి చేశారు.

 

Advertisement
Advertisement