KCR | నన్ను తిట్టడం..నేను చనిపోవాలని కోరుకోవడం..ఇదే వారికి కావలసింది!
KCR | తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో జరుగుతున్న బీఆర్ఎస్ఎల్‌పీ (BRSLP) సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కీలక వ్యాఖ్యలు చేశారు.
KCR | తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో జరుగుతున్న బీఆర్ఎస్ఎల్‌పీ (BRSLP) సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. తనను దూషించడం, అవమానించడం, తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ విధానంగా మారిందని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. పార్టీని గెలిపించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టకుందని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా ఇంకా తెలిసేదని అభిప్రాయపడ్డారు.
తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి అహంకార పూరిత హింస ప్రయత్నాలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తాము ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో నేర్పుతున్నదని చెప్పారు. గుడ్లు తీయడం, లాగులో తొండలు ఇడ్చుడు వంటివి ఎట్లా చేయాలో చెబుతున్నదని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ తేలేదని మండిపడ్డారు. తీసుకువచ్చిన పాలసీ అంతా రియల్ ఎస్టేట్ కు సంబంధించిందే అయినా రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు డైరెక్టుగా వచ్చేదని, కానీ ఈ రోజు ఒక్క యూరియా బస్తా కోసం కుటుంబం అంతా లైన్లలో నిలబడే పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది పథకం ఒకటి ప్రకటించకపోగా ఉన్న వాటిని ఆపేసిందని మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



