త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jagadish Reddy | కేసీఆర్‌పై నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి

Jagadish Reddy | మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR)పై సీఎం (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమ‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి (Jagadish Reddy) హెచ్చ‌రించారు. హిల్ట్ (HILT) పేరుతో చేయాల‌నుకున్న దోపిడీని అడ్డుకుంటున్నార‌నే ఆక్రోశంతోనే అలా మాట్లాడుతున్నార‌ని వ్యాఖ్యానించారు

A

News | Published On Dec 8, 2025, 1.41 pm IST

Jagadish Reddy | కేసీఆర్‌పై నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి
Advertisement

Jagadish Reddy | మాజీ ముఖ్య‌మంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు కేసీఆర్ (KCR)పై ముఖ్య‌మంత్రి (CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమ‌ని మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి (Jagadish Reddy) స్ప‌ష్టం చేశారు. తాము మాట్లాడ‌డం ప్రారంభిస్తే త‌ట్ట‌కోలేవ‌ని హెచ్చ‌రించారు. హైద‌రాబాద్‌లో ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ ప్ర‌జాపాల‌న (Praja Palana) పేరిట సీఎం ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ, పంచాయతీరాజ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఒక సాకుతో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో స‌భ‌లు పెడుతున్నార‌ని ఆరోపించారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఏం మాట్లాడినా ఏం కాద‌ని, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌న వైఖ‌రిని మార్చుకోవాల్సినప్ప‌టికీ పాత పంథాను కొన‌సాగిస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆయ‌న మాట‌ల‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న నోరు తెరిస్తే అవే బూతులు, రోత మాట‌లు వ‌స్తున్నాయ‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులే వ్యాఖ్యానిస్తున్నార‌ని అన్నారు.
హిల్ట్ పాల‌సీని అడ్డ‌కున్నందుకే ఆక్రోశంలో ఆ మాట‌లని ధ్వ‌జం
హిల్ట్ (HILT) కుంభ‌కోణాన్ని బ‌హిర్గ‌తం చేయ‌డంతో త‌ట్టుకోలేక నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని అన్నారు. ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నాన్ని అప్ప‌నంగా కొట్టేద్దామ‌ని చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని అడ్డుకున్నార‌నే ఆగ్ర‌హంతో ఆయ‌న మాట్లాడుతున్నార‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. పారిశ్రామిక భూముల‌ను త‌న కుటుంబ‌స‌భ్యులు, బంధువులు, స‌న్నిహితులు, అయిన‌వారికి క‌ట్ట‌బెట్టేందుకే హిల్ట్ పాల‌సీని తీసుకువ‌చ్చార‌న్నారు. తాను సొంతం చేసుకోవాల‌నుకున్న దానిని అడ్డుకున్నార‌నే ఆక్రోశంలో వ‌చ్చిన మాట‌లుగా వాటిని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.
ఎస్ఎల్‌బీసీ పూర్తి కాక‌పోవ‌డానికి ఎవ‌రు కార‌ణ‌మ‌ని ప్ర‌శ్న‌
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, సంబంధిత మంత్రి చేసిన మూర్ఖ‌పు ప‌ని కార‌ణంగా ఎటువంటి ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌కుండానే ఎస్ఎల్‌బీసీ (SLBC)త‌వ్వ‌కాలు చేప‌ట్టార‌ని మండిప‌డ్డారు. అందులో ప‌డి చ‌నిపోయిన ఎనిమిది మంది కార్మికుల శ‌వాలు ఇప్ప‌టికీ తీయ‌లేక‌పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఎస్ఎల్‌బీసీ పూర్తి కాక‌పోవ‌డానికి ఎవ‌రు కార‌ణ‌మ‌ని ప్ర‌శ్నించారు. రేవంత్‌రెడ్డి గురువు, ప్ర‌స్తుత ప‌క్క రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు (Chandrababu) చేసిన కుట్ర‌ల కార‌ణంగా ప్ర‌పంచంలో ఎక్క‌డ లేని టెక్నాల‌జీని తీసుకువ‌చ్చి దానిని పూర్తి కాకుండా చేశార‌ని ఆరోపించారు. న‌ల్గొండ (Nalgonda) ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. వారు చేసిన త‌ప్పిదాల‌కు ప్ర‌జ‌లే వారిని శిక్షిస్తారని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement