Errabelli Swarna | ‘కల్వకుంట్ల’ పేరున్నందుకే పదవులు.. ఇదేనా మీ సామాజిక న్యాయం: కవితపై ఎర్రబెల్లి స్వర్ణ ఫైర్
Errabelli Swarna | రాష్ట్రంలో సాధారణ కార్యకర్తలకు రాని అవకాశాలు కేవలం 'కల్వకుంట్ల' (Kalwakuntla) అనే పేరున్నందుకే మీకు పదవులు దక్కుతున్నాయని.. ఇదేనా మీ సామాజిక న్యాయం? అని కవిత (Kavitha)పై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఫైరయ్యారు. ఇది ఏ రకమైన సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు.
- బీఆర్ఎస్ పాపాలను అప్పుడే ప్రశ్నిస్తే కవితను ప్రజలు నమ్మేవారు
- దోపిడీ చేసిందెవరో ఏ పల్లెకెళ్లినా చెప్తారు
- మద్యం వ్యాపారాల్లో తల దూర్చిన వారికి ఆత్మగౌరవం ఉంటుందా?
- ఒకే కుటుంబానికి పదవులు దక్కడం సామాజిక న్యాయమా?
- కవితపై ఎర్రబెల్లి స్వర్ణ ధ్వజం
Errabelli Swarna | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో సాధారణ కార్యకర్తలకు రాని అవకాశాలు కేవలం 'కల్వకుంట్ల' (Kalwakuntla) అనే పేరున్నందుకే మీకు పదవులు దక్కుతున్నాయని.. ఇదేనా మీ సామాజిక న్యాయం? అని కవిత (Kavitha)పై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఫైరయ్యారు. ఉద్యమకారుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒకే కుటుంబానికి అన్ని పదవులు దక్కడం ఏ రకమైన సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు. అప్పుడు నీకు సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా అని ధ్వజమెత్తారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని పాపాలను అప్పుడే ప్రశ్నించి ఉంటే కవితను తెలంగాణ ప్రజలు నమ్మేవారు. దోపీడీ పాలన చేసింది ఎవరో తెలంగాణ పల్లెల్లో ఎవరిని అడిగినా చెప్తారు. రేవంత్ రెడ్డి పాలనను రాక్షస పాలన అంటున్న కవితకు ఎవరు రాక్షస పాలన చేశారో తెలియదా? దోచుకున్న డబ్బులో వాటా దొరక్కపోతే ఇప్పుడు వచ్చి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నది. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణను దోచుకుని సర్వనాశనం చేసినవారు ఇప్పుడు ఆ పాపాలకు కేసులు నమోదు అవుతుండడంతో మరోసారి ఆత్మగౌరవం, తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవడం విడ్డూరంగా ఉంది అని స్వర్ణ విమర్శించారు.
నీ విజ్ఞతకే వదిలేస్తున్నా..
గతంలో మా నాన్న కంటే రేవంత్ రెడ్డి బాగా పాలన చేస్తున్నారని చెప్పిన నీ నోటితోనే, మళ్లీ రేవంత్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని అనడం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పే నువ్వు.. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు ఇతర రాష్ట్రాల మద్యం వ్యాపారాల్లో తలదూర్చిన వారికి ఆత్మగౌరవం ఉందా? అని ప్రశ్నించారు.
తెలంగాణపై దాడిగా చిత్రీకరించొద్దు..
మీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై స్పందించని నువ్వు, జాతీయ స్థాయిలో మహిళా హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మీ మీద వచ్చే అవినీతి ఆరోపణలను తెలంగాణ సమాజంపై దాడిగా చిత్రీకరించడం ఆపండి. ఆరోపణలు మీ వ్యక్తిగత వ్యాపారాలకు సంబంధించినవి అని, తెలంగాణ ప్రజలకు సంబంధించినవి కావు అని స్వర్ణ హితవు పలికారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



