త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaddiraju, Niranjan Reddy | ప‌ట్ట‌ప‌గ‌లే ఇంత దౌర్జ‌న్య‌మా? కాంగ్రెస్ గూండాల‌ను క‌ఠినంగా శిక్షించాలే: ఎంపీ వ‌ద్దిరాజు, నిరంజ‌న్‌రెడ్డి డిమాండ్‌

Vaddiraju, Niranjan Reddy | గజ్వేల్ (Gajwel) లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (MLA camp office) మీద ప‌ట్ట‌ప‌గ‌లే కాంగ్రెస్ గూండాలు దౌర్జ‌న్యం సృష్టించార‌ని, ఈ దాడి అత్యంత‌ శోచనీయమ‌ని రాజ్య‌స‌భ ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (MP Vaddiraju Ravichandra), మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి(Niranjan Reddy) అన్నారు. క్యాంపు కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డ‌మంటే ప్రభుత్వ ఆస్తులను కొల్ల‌గొట్ట‌డ‌మేన‌న్నారు. దీన్ని వారు వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో తీవ్రంగా ఖండించారు

S

News | Published On Apr 4, 2026, 3.25 pm IST

Vaddiraju, Niranjan Reddy | ప‌ట్ట‌ప‌గ‌లే ఇంత దౌర్జ‌న్య‌మా? కాంగ్రెస్ గూండాల‌ను క‌ఠినంగా శిక్షించాలే: ఎంపీ వ‌ద్దిరాజు, నిరంజ‌న్‌రెడ్డి డిమాండ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్: గజ్వేల్ (Gajwel) లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (MLA camp office) మీద ప‌ట్ట‌ప‌గ‌లే కాంగ్రెస్ గూండాలు దౌర్జ‌న్యం సృష్టించార‌ని, ఈ దాడి అత్యంత‌ శోచనీయమ‌ని రాజ్య‌స‌భ ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌ (MP Vaddiraju Ravichandra), మాజీ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి(Niranjan Reddy) అన్నారు. క్యాంపు కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డ‌మంటే ప్రభుత్వ ఆస్తులను కొల్ల‌గొట్ట‌డ‌మేన‌న్నారు. దీన్ని వారు వేర్వేరు ప్ర‌క‌ట‌న‌ల్లో తీవ్రంగా ఖండించారు (Condemned). కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇలాంటి నీచ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డటం సిగ్గుచేట‌న్నారు. వెంట‌నే దుండ‌గుల‌ను అరెస్టు చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌జ‌లను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే..

ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే కాంగ్రెస్ ఇలాంటి దుందుడుకు చ‌ర్య‌ల‌ను ప్రోత్స‌హిస్తోంద‌ని ఆరోపించారు. ప‌దేళ్లు పాలించిన మాజీ సీఎం క్యాంపు కార్యాలయం మీద ప‌ట్ట‌ప‌గ‌లే దాడులు చేస్తే ఇక సామాన్యుల ప‌రిస్థితి ఏంట‌ని ఆవేద‌న చెందారు. పోలీసులు దాడికి పాల్పడిన దుండగులను గుర్తించి, కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి వేళ పోలీసులు అలసత్వం వహించడం గర్హనీయమ‌న్నారు.

పోలీసులది ప్రేక్ష‌క పాత్ర‌: వ‌ద్దిరాజు

వందల మంది చూస్తుండగా మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడితే ఇక సామాన్య ప్రజల ర‌క్ష‌ణ ఏంట‌ని ప్రశ్నించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం శోచనీయమన్నారు. కాంగ్రెస్‌కు చిత్త‌శుద్ధి ఉంటే ఇచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చాల‌న్నారు. ఇలా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేయ‌డం నీచ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ దుండగులను వెంటనే అరెస్టు చేయాల‌ని, చట్టపరంగా కఠిన శిక్షలు విధించాల‌ని డీజీపీ శివధర్ రెడ్డిని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.

 

 

Advertisement
Advertisement