Justice PC Ghosh Commission | పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు హర్షణీయం.. మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి
Justice PC Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) హర్షం వ్యక్తం చేశారు.
Justice PC Ghosh Commission | త్రినేత్ర.న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ కక్షపూరిత విధానాలను మార్చుకొని బుద్ది తెచ్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం మీద నిందలు మోపి బీఆర్ఎస్, కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీజేపీ వాడుకున్నాయని విమర్శించారు. రెండున్నరేండ్లు మరమ్మతులు చేపట్టకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. చివరకు గత్యంతరం లేక మరమ్మతులు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలన్నారు.
న్యాయం గెలిచింది..
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందని మాజీ మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడంతో ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందని చెప్పారు. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు. కానీ న్యాయస్థానాలపై నమ్మకంతో వారు పోరాడారని, చివరకు నిజం గెలిచిందని చెప్పారు.
తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేండ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమని ఈ తీర్పుతో స్పష్టమైందని, కాంగ్రెస్, బీజేపీలకు ఇకనైనా కనువిప్పు కలగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులను పక్కన పెట్టి పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి హైకోర్టు తీర్పు నిదర్శనమని చెప్పారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



