Indigo | అర్ధరాత్రి వరకు నో ఫ్లైట్స్…
Indigo | ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విమానాల రద్దు కొనసాగుతోంది. సమాచారం ఇవ్వకుండా విమానాల ఆలస్యంపై శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో అయ్యప్ప స్వాములు (Ayyappa Swamulu)నిరసనకు దిగారు. డీజీసీఏ (DGCA) నిబంధనలతో సమస్య ఎదురై విమానాల రద్దు అని చెబుతున్నప్పటికీ, దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఒక పైలట్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది
కొనసాగుతున్న విమానాల రద్దు.. ప్రయాణీకుల వెతలు
Indigo | విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) విమానాల రద్దు కొనసాగుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. శుక్రవారం మొత్తమ్మీద దేశవ్యాప్తంగా 500కు పైగా విమానాలను సంస్థ రద్దు చేసింది. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport) నుంచే 155 విమానాలను రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అందులో శంషాబాద్ నుంచి ఇతర నగరాలకు వెళ్లాల్సిన విమానాలు 84 కాగా, రావాల్సినవి 71 విమానాలు ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న విమానాలను రద్దు చేయడంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు సమాచారాన్ని సైతం ముందుగా ఇవ్వకుండా చెక్ ఇన్ అయిన తరువాతే ఇవ్వడంపై మండుపడుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో నిరసనకు దిగిన అయ్యప్ప స్వాములు
విమానాల రద్దుతో శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు (Ayyappa Swamulu) నిరసనకు దిగారు. గురువారం సాయంత్రం శంషాబాద్ నుంచి కొచ్చిన్ (Kochin) బయల్దేరాల్సిన విమానం కోసం చెక్ ఇన్ అయిన ప్రయాణీకులు శుక్రవారం ఉదయం వరకు కూడా విమానం గురించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. బోర్డింగ్ గేటు ఎదుట బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. విమాన రద్దుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రద్దు వెనుక పెద్ద ప్లాన్ ఉందని పైలట్ ట్వీట్
డీజీసీఏ (DGCA) నూతన నిబంధనలు, నిర్వహణ సమస్యలతో విమానాల రద్దు జరుగుతోందని, దానిని సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుతామని కంపెనీ చెబుతున్నప్పటికీ, దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఒక పైలట్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒక ప్లాన్ ప్రకారం దేశీయ రూట్లలో విమానాలను రద్దు చేసి, విదేశీ రూట్లలో మాత్రం సేవలను కొనసాగిస్తోందని ఆరోపించారు. ఆ రూట్లలో ఫ్లైట్లను నడపడం ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుందని, ఎక్కవ ఆదాయం, తక్కవ ఖర్చులు ఉండడమే దీనికి కారణమని ఆయన స్పష్టం చేశారు. దానితో పాటు విదేశీ విమానాల రద్దుకు నిబంధనలు సైతం కఠినంగా ఉండడంతో కంపెనీ తన రెప్యుటేషన్‌ను కాపాడుకునేందుకు కంపెనీ ఇలా చేస్తోందని వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





