Deputy CM Bhatti | సింగరేణిలో 13,119 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ జరిగింది: భట్టి
Deputy CM Bhatti | అవసరం లేకపోయినా మెడికల్ ఇన్వాలిడేషన్ (Medical Invalidation) చేయడంతో సింగరేణి(Singareni) పై ఆర్థిక భారం పడుతుందని.. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఏసీబీ (ACB), విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సింగరేణిలో 13,119 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ జరిగినట్లు పేర్కొన్నారు.
- దీంతో ఆర్థిక భారం పడుతోంది
- దీనిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నాం
- శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి
త్రినేత్ర.న్యూస్: అవసరం లేకపోయినా మెడికల్ ఇన్వాలిడేషన్ (Medical Invalidation) చేయడంతో సింగరేణి(Singareni) పై ఆర్థిక భారం పడుతుందని.. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఏసీబీ (ACB), విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ పై కౌన్సిల్లో సభ్యుడు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు భట్టి సమాధానమిచ్చారు. 2014 నుంచి 2023 వరకు ఐదు సంవత్సరాల కాలంలో సింగరేణిలో 13,119 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ జరిగినట్లు పేర్కొన్నారు.
జెన్‌కోపై ఉత్పత్తి భారం...
సింగరేణిలో టన్ను బొగ్గు ధర రూ.4088 కాగా కోల్ ఇండియాలో అదే టన్ను బొగ్గు ధర రూ.1065, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లో రూ.2169 కి లభిస్తుందని భట్టి తెలిపారు. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 30 శాతం జెన్ కోకు వెళుతుంది. బహిరంగ మార్కెట్లో దొరికే బొగ్గు కంటే ఎక్కువ ధరకు సింగరేణి నుంచి కొనుగోలు చేస్తుంది. దీంతో జెన్ కో పై ఉత్పత్తి భారం పడుతుంది. ఫలితంగా రాష్ట్రంలోని 3.55 కోట్ల జనాభా పై ఆర్థిక భారం పడుతుంది అని డిప్యూటీ సీఎం తెలిపారు.
కోల్ ఇండియాతో రెండు రూపాయలు తగ్గింపు..
సింగరేణి నుంచి అధిక ధరకు జెన్ కో బొగ్గు కొనుగోలు చేయడం మూలంగా అదనపు ఆర్థిక భారం పడుతుందన్నారు. ఇదే సందర్భంలో కోల్ ఇండియా నుంచి జెన్ కో బొగ్గును కొనుగోలు చేస్తే యూనిట్ పై రెండు రూపాయల భారం తగ్గుతుందని చెప్పారు. వెస్ట్రన్ కూల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు తీసుకుంటే ఒక్కో యూనిట్ పై రూ.1.25 అదనకు భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. నిర్దిష్ట నిర్ణయాలు తీసుకొని సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి, జెన్ కో రెండు ప్రభుత్వ సంస్థలే అని.. వీటిని బ్యాలెన్స్ చేస్తూ రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.
2000 సంవత్సరం నుంచి 2014 వరకు 14 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్వాలిడేషన్ సంఖ్య 3,859 మాత్రమే అని వివరించారు. కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్ లో నిబంధనలు పరిశీలించామన్నారు. మైనింగ్ జీఎం, నామినేటెడ్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెడికల్ ఇన్వాలిడేషన్ వారిని వదిలేయకుండా మానవీయ కోణంలో పరిశీలించి ఆధారపడిన కుటుంబాలను అనుమతించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
రేషనలైజేషన్ కోసం ప్రయత్నం...
గత రెండు సంవత్సరాల్లో 14 సార్లు మెడికల్ బోర్డుల సమావేశం నిర్వహించగా 2024లో 1041 మందికి, 2025లో 949 మందికి మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఆధారపడిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వివరించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న మార్కెట్ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో సింగరేణిలో రేషనలైజేషన్ కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తు తరాలకు అందించాలంటే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





