Kethireddy Vasudeva Reddy | మీ హామీల అమలు.. నేతి బీరకాయలో నెయ్యంత
Kethireddy Vasudeva Reddy | నేతి బీరకాయలో నెయ్యెంత వాస్తవమో.. కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఎద్దేవా చేశారు. రైతు డిక్లరేషన్ (Farmers' Declaration) అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టాలనే ఆలోచనతో రైతు సంగ్రామ సదస్సు (Farmers' Agitation Meeting) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
- రైతు డిక్లరేషన్ ప్రకటించి 30 నెలలవుతోంది
- అయినా ఏ హామీ నెరవేరలే
- ధాన్యం కొనే దిక్కులేక రైతులు మలమల మాడుతున్నరు
- కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకే రైతు సంగ్రామ సదస్సు
- వాల్ పోస్టర్ల ఆవిష్కరణలో డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ధ్వజం
Kethireddy Vasudeva Reddy | త్రినేత్ర.న్యూస్: నేతి బీరకాయలో నెయ్యెంత వాస్తవమో.. కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతేనని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఎద్దేవా చేశారు. రైతు డిక్లరేషన్ (Farmers' Declaration) అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టాలనే ఆలోచనతో రైతు సంగ్రామ సదస్సు (Farmers' Agitation Meeting) ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మే 6న హనుమకొండలోని హంటర్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సు వాల్ పోస్టర్లను ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో కలిసి ఆయన ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కు దిక్కులేదు. రైతన్నకు అండలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు 2022, మే 6న వరంగల్ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. 30 నెలలవుతున్నా డిక్లరేషన్ లోని హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు చేసిన మోసాన్ని వరంగల్ నుంచి ఎండగట్టాలని ఆలోచనతో ఈ సదస్సును ఏర్పాటు చేశాం అని కేతిరెడ్డి చెప్పారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత నెరవేరుస్తం..
నాడు ఎన్నికల ముందు ఆపద మొక్కులు మొక్కుతూ రైతులకు రైతు భరోసాకు రూ.15000 అని, కౌలు రైతులకు ఎకరానికిరూ.15000 అని, రైతు కూలీలకు 12,000 అంటూ అనే హామీలు ఇచ్చి అమలు చేయలేక రైతులను వంచనకు గురిచేసింది. ఒకపక్క కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు దిక్కులేదు, మరోపక్క పండించిన పంటను కొనే దిక్కులేదు. నేతి బీరకాయలో నెయ్యెంత వాస్తవమో.. కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే. వీటన్నిటిపై రైతులను చైతన్యం చేసే దిశగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నెరవేరుస్తాం. రైతులకు అండగా ఉంటూ రైతు పక్షాన పోరాటం చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
రైతులు మలమల మాడుతున్నరు..
నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పండించిన పంటను కొనే దిక్కులేదు. ఎండలో రైతులు మలమల మాడిన, ఇబ్బందులు అవుతున్న కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడుతుంది. రెండున్నరేండ్లుగా రైతులకు చేస్తున్న మోసాలు మరోసారి బయటపడతాయనే ఉద్దేశంతో చిల్లర రాజకీయాలకు తెరలేపింది. వరంగల్ లో రైతు మేళా పేరు మీద నాటకాలాడుతూ, డైవర్షన్ డ్రామాలు చేస్తుంది. రైతు సంగ్రామ సదస్సును డైవర్షన్ చేయడానికి కుప్పిగంతులు వేస్తా ఉంది అని ఆయన విమర్శించారు.

రైతులను రేవంత్ బికారీగా చేసిండు..
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను రాజు చేస్తే నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని బికారీగా తయారు చేసే పరిస్థితి దాపురిచ్చింది. దశాబ్దాల వివక్షతో ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న రైతుల్లో.. ధైర్యాన్ని నింపడానికి కేసీఆర్ పెట్టుబడి సహాయం కింద ఎకరానికి ఏడాదికి పదివేల రూపాయల నగదు సాయం అందించే రైతుబంధును ప్రారంభించారు. 11 విడతల్లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 వేల కోట్లు వేసిన చరిత్ర కేసీఆర్ ది. రైతు బీమా పథకం, 24 గంటల ఉచిత విద్యుత్ పథకం.. ఇలా అనేక పథకాలతో అండగా నిలిచింది. పండించిన పంటలను వంద 100% చివరి గింజ వరకు కొనుగోలు చేశాం అని వాసుదేవరెడ్డి గుర్తు చేశారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా రైతు ప్రతినిధుల సదస్సుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వస్తున్నారని.. జిల్లా నలుమూలల నుండి రైతు ప్రతినిధులు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని వాసుదేవరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



