CM Revanth Reddy | గ్యారంటీలపై అనుమానముంటే తెలంగాణకు రండి: కేరళం ఓటర్లతో సీఎం రేవంత్
CM Revanth Reddy | యూడీఎఫ్ (UDF) ప్రకటించిన గ్యారంటీల(Guarantee) పై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. యూడీఎఫ్ మేనిఫెస్టో(Manifesto)ను కొచ్చిలో గురువారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. కేరళంలో పినరయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు.
- అవినీతి, కుటుంబ పాలనలో కేసీఆర్.. విజయన్ ది ఒకే బాట
- కేంద్ర నిధులు మోదీ కరుణ కాదు.. ప్రజల హక్కు
- యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదలలో రేవంత్ రెడ్డి
త్రినేత్ర.న్యూస్: యూడీఎఫ్ (UDF) ప్రకటించిన గ్యారంటీల(Guarantee) పై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి.. తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవచ్చన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే ప్రత్యక్షంగా చూపిస్తామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టో(Manifesto)ను కొచ్చిలో గురువారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. కేరళంలో పినరయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు. కేపీసీసీ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సీఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీప్ దాస్ మున్షీ తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
ఈసారి కేరళంలో మార్పు వస్తుంది..
ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని నరేంద్ర మోదీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని, కేరళంనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ, విజయన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేవుడి సొంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికీ రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలనలో పినరయి విజయన్, కేసీఆర్‌ల మధ్య పోలికలున్నాయని విమర్శించారు. 2023లో తెలంగాణలో జరిగిన మార్పే కేరళంలో జరుగుతుందని సీఎం అన్నారు. “పో మోనే విజయా” వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మోదీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదన్నారు.
నిధుల సాధన ప్రథమం..
అవినీతి నియంత్రణ, ఆదాయానికి పెంపు, కేంద్ర పథకాల వినియోగం, రాష్ట్ర నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మోదీ కరుణ కాదని.. అది ప్రజల హక్కు అని తేల్చిచెప్పారు. యూడీఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు.
నెలకు 6 వేలు ఆదా...
తెలంగాణలో మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేల చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని చెప్పారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. దీంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని వివరించారు.
ఇందిరా ఐదు గ్యారంటీలు..
. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
. కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం
. సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు
. ఉమెన్ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
. యువతకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



