త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGTS Chairman Sathish | నిజాల‌డిగితే ఇంటి మీదికెళ్లి దాడి చేస్త‌రా.. ఇది ఏ సంస్కృతి?

TGTS Chairman Sathish | సోషల్ మీడియా పోస్ట్‌పై నిజానిజాలు అడిగినందుకు రాజేంద్ర(Rajendra) అనే వ్యక్తి ఇంటికి వెళ్లి క్రిశాంక్ (Krishank) దాడి చేయడం దారుణ‌మ‌ని టీపీసీసీ సోషల్ మీడియా, TGTS చైర్మన్ మన్నె సతీశ్ ఫైర‌య్యారు. తెలంగాణలో ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నారా? ఇది ఏ రకమైన సంస్కృతి? అని ప్ర‌శ్నించారు.

S

News | Published On Apr 24, 2026, 5.40 pm IST

TGTS Chairman Sathish | నిజాల‌డిగితే ఇంటి మీదికెళ్లి దాడి చేస్త‌రా.. ఇది ఏ సంస్కృతి?
Advertisement
  • పెద్ద‌వాళ్లు ప్రాధేయ‌ప‌డినా విన‌రా
  • క్రిశాంక్ వి నిరాధార‌ ఆరోప‌ణ‌లు
  • త‌ప్పుగా మాట్లాడిన‌ ఎవ‌రినీ వ‌దిలిపెట్టం
  • టీపీసీసీ సోషల్ మీడియా, TGTS చైర్మన్ మన్నె సతీశ్ హెచ్చ‌రిక‌

TGTS Chairman Sathish | త్రినేత్ర‌.న్యూస్‌: సోషల్ మీడియా పోస్ట్‌పై నిజానిజాలు అడిగినందుకు రాజేంద్ర(Rajendra) అనే వ్యక్తి ఇంటికి వెళ్లి క్రిశాంక్ (Krishank) దాడి చేయడం దారుణ‌మ‌ని టీపీసీసీ సోషల్ మీడియా, TGTS చైర్మన్ మన్నె సతీశ్ ఫైర‌య్యారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడి చేయడం వంటి చర్యలతో తెలంగాణలో ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నారా? ఇది ఏ రకమైన సంస్కృతి? అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడిన వాస్తవాలను తట్టుకోలేక, వారిని కౌంటర్ చేయడానికే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నార‌ని విమ‌ర్శించారు.

శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇంట్లో పెద్దవాళ్లు ప్రాధేయపడుతున్నా వినకుండా బెదిరింపులకు దిగడం అన్యాయం. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రి, ఇతర నాయకులపై క్రిశాంక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇంతేకాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించ‌డం స‌రికాదు.

బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాది ఫేక్‌ ప్ర‌చారం..

అంగన్‌వాడీ టీచర్ల మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అవాస్తవ ప్రచారం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా ఓపెన్ టెండర్ల ద్వారానే మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. అని స‌తీశ్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement