అవసరమైతే అతిథుల కోసం ప్రత్యేక విమానాలు: ఉపముఖ్యమంత్రి భట్టి
Rising Telangana | తెలంగాణ రైజింగ్ (Rising Telangana) గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యే అతిథుల కోసం అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు
Rising Telangana | ఇండిగో (Indigo) విమానయాన సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ (Rising Telangana) గ్లోబల్ సమ్మిట్ కు అవసరమైతే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (Deputy CM) మల్లు భట్టి విక్రమార్క (Vikramarka) తెలిపారు. అప్పటిలోగా సంక్షోభం ముగిసి విమానాలు సరిగ్గా నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లేనిపక్షంలో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
గవర్నర్‌కు ఆహ్వానం
సమ్మిట్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మను అధికారికంగా డిప్యూటీ సీఎం ఆదివారం ఆహ్వానించారు. మరో మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఆయన గవర్నర్‌ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నేటి మధ్యాహ్నం శిఖరాగ్ర సమావేశం
సోమవారం మధ్యాహ్నం జరుగనున్న శిఖరాగ్ర సమావేశంలో ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌కు చెందిన ఎరిక్ స్వైడర్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి, కిరణ్ మజుందార్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ప్రసంగిస్తారని వివరించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకోపన్యాసం చేస్తారని చెప్పారు.
సంబంధిత వార్తలు

Kishan Reddy | మెట్రో రెండో దశకు అభ్యంతరం లేదు.. 50:50 ప్రాతిపదికన ముందుకెళ్లేందుకు కేంద్రం సిద్ధం: కిషన్‌రెడ్డి
మే 20, 2026

Mallu Ravi | కిషన్‌రెడ్డి.. నిధులు తెచ్చి చిత్తశుద్ధిని చాటుకో: ఎంపీ మల్లు రవి కౌంటర్
మే 18, 2026

Kishan Reddy | బండి భగీరథ్ లొంగిపోయాడు కదా.. ఇష్యూ ఏముంది..! : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మే 17, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



