Kavitha kalwakuntla | కేసీఆర్ మారతారేమో అనుకున్నా.. కేటీఆర్ కైతే ఏం తెల్వదు: కవిత కామెంట్స్
Kavitha kalwakuntla | తనను పార్టీలో నుంచి బయటకు పంపితే వెంటనే పార్టీ పెట్టలేదని, వాళ్లు మారతారేమోనని ఎదురుచూశానని కల్వకుంట్ల కవిత (Kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్(KCR)కు అధికారమే ఎక్కువైందా.. మమకారం తగ్గిపోయిందా? రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు.
Kavitha kalwakuntla | త్రినేత్ర.న్యూస్: తనను పార్టీలో నుంచి బయటకు పంపితే వెంటనే పార్టీ పెట్టలేదని, వాళ్లు మారతారేమోనని ఎదురుచూశానని కల్వకుంట్ల కవిత (Kavitha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్(KCR)కు అధికారమే ఎక్కువైందా.. మమకారం తగ్గిపోయిందా? రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్(KTR)కు రాజకీయం తెల్వదన్నారు. మునీరాబాద్ పార్టీ ఆవిర్భావ సభలో శనివారం ఆమె ప్రసంగించారు.
అధికారం ఇవ్వకపోతే వదిలేస్తారా?
ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అంటున్నారు. మీకు అధికారం ఇవ్వకపోతే ప్రజలను వదిలేస్తారా? రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తోంది. ప్రజలు అరిగోస పడుతున్నరు. నన్ను పార్టీలో నుంచి బయటకు పంపారు. పది నెలలైనా మారలేదు. ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది. ఆనాడు మీకు జరిగింది.. ఇవాళ నాకు జరిగింది.. ఇందులో తేడా ఏమి లేదు' అంటూ కల్వకుంట్ల కవిత మాట్లాడారు.
సామాజిక రథ చక్రం ముక్కలైంది..
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైంది. కొత్త రాష్ట్రంలో జరగాల్సిన పనులు సరిగా జరగలేదు. తెలంగాణ వస్తే బానిస సంకెళ్లు పోతాయనుకుంటే రైతులకు బేడీలు వచ్చి పడ్డాయి. ఇసుక దందా వల్ల దళితులు దాడులకు గురయ్యారు. నిఘా నీడలో తెలంగాణ అంతా కాలం వెళ్లదీసింది. ఆనాడు పాలించిన కుటుంబంలో నేనూ భాగమే. అందుకు కొన్ని విషయాల్లో సిగ్గుపడుతున్నాను' అని కవిత పేర్కొన్నారు.
మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి. కానీ ఈరోజు ఆయన పరిణతి కోల్పోయారు. కేటీఆర్‌కు రాజకీయం తెల్వదు. కేసీఆర్ మారుతారేమోనని చూశా. కానీ నన్నే సస్పెండ్ చేశారు అని కవిత వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



