త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor Self Enumeration | నేను స్వీయ న‌మోదు చేశాను.. మీరూ చేసుకోండి: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ శివప్రతాప్ శుక్లా పిలుపు

Governor Self Enumeration | జ‌న‌గ‌ణ‌న‌ (Census)లో భాగంగా తెలంగాణ సోద‌ర‌, సోద‌రీమ‌ణులంతా స్వీయ న‌మోదు చేసుకోవాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివప్రతాప్ శుక్లా (Shivaprathap Shukla) పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఇందులో తెలంగాణ పౌరులందరూ చురుకుగా పాల్గొనాల‌న్నారు.

S

News | Published On Apr 26, 2026, 12.39 pm IST

Governor Self Enumeration | నేను స్వీయ న‌మోదు చేశాను.. మీరూ చేసుకోండి: రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ శివప్రతాప్ శుక్లా పిలుపు
Advertisement

Governor Self Enumeration | త్రినేత్ర‌.న్యూస్‌: జ‌న‌గ‌ణ‌న‌(Census)లో భాగంగా తెలంగాణ సోద‌ర‌, సోద‌రీమ‌ణులంతా స్వీయ న‌మోదు చేసుకోవాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివప్రతాప్ శుక్లా(Shivaprathap Shukla) పిలుపునిచ్చారు. ఆదివారం ఉద‌యం లోక్‌భ‌వ‌న్‌లో ఆయ‌న జనగణన 2027 (Census of India-2027) స్వీయ న‌మోదును అధికారికంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్ తన వివరాలను నమోదు చేసుకున్నారు. అనంత‌రం ఆయ‌న ప్ర‌జ‌లనుద్దేశించి మాట్లాడారు.

జనాభా గణన అనేది ఒక కీలకమైన జాతీయ కార్యక్రమం. ఇది మన జనాభా, వారి సామాజిక-ఆర్థిక స్థితిపై సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది. ఇది ప్రణాళిక, సుపరిపాలన, వనరుల సమాన పంపిణీకి పునాది వంటిది. తద్వారా అభివృద్ధి ఫలాల‌ను సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి, గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో జనాభా గణన పోషించే కీలక పాత్రలో దాని ప్రాముఖ్యత ఇమిడి ఉంది అని వివ‌రించారు.

రాష్ట్రంలో తొలి గ‌ణ‌న‌..

కచ్చితమైన సమాచారం, లక్షిత సంక్షేమ పథకాలను రూపొందించడానికి, జాతీయ పురోగతిని సమర్థవంతంగా అంచనా వేయడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటి జనాభా గణన కావడం వల్ల ఇది ప్రత్యేకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి, పురోగతికి కచ్చితమైన సమాచార సేకరణ చాలా కీలకం అని గ‌వ‌ర్న‌ర్ చెప్పారు.

మొద‌టి డిజిట‌ల్ జ‌న గ‌ణ‌న‌..

రాష్ట్రంలో స్వీయ గణన దశ నేటి నుంచి వ‌చ్చే నెల‌ 10 వరకు నిర్వహిస్తారు. తరువాత మే 11 నుంచి జూన్ 9 వరకు గృహ జాబితా కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఇది భారతదేశపు మొదటి పూర్తి డిజిటల్ జనాభా గణన అవుతుంది. స్వీయ గణన అనేది ఒక నూతనమైన, ప్రగతిశీలమైన వ్యవస్థ. దీని ద్వారా కుటుంబాలు తమ వివరాలను డిజిటల్‌గా నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ సరళమైనది, సౌకర్యవంతమైనది, వినియోగదారులకు అనుకూలమైనది. ఇళ్ల జాబితా కూడా డిజిటల్‌గా నిర్వహిస్తారు. దీంతో కచ్చితత్వం, పారదర్శకత, సమర్థతకు అవ‌కాశం లభిస్తుంది.

నేను స్వయంగా స్వయం గణన ప్రక్రియను ఈరోజు పూర్తి చేశాను. ఈ ప్రక్రియ అత్యంత సరళంగా, సమర్థవంతంగా ఉంది. తెలంగాణ పౌరులందరూ చురుకుగా పాల్గొనాలి. కచ్చితమైన, స్పష్టమైన సమాచారాన్ని అందించి జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను. మీ భాగస్వామ్యం బలమైన, సమ్మిళితమైన, సువ్యవస్థితమైన తెలంగాణ, భారతదేశ నిర్మాణానికి దోహదపడుతుంది అని గ‌వ‌ర్న‌ర్ వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో సెన్సెస్ డైరెక్టర్ భారతీ హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కే శశి కిరణాచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement