BRS | ఇవిగో మీ స్కాంల వివరాలు.. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించండి: ప్రధాన ప్రతిపక్షం డిమాండ్
BRS | కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి (corruption), కుంభకోణాల (Scams)పై సిట్టింగ్ జడ్జీ (Sitting judge) విచారణ లేదా హౌస్ కమిటీ (House committee) వేసి విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారిపోయిందని.. లెక్కకు మించిన కుంభకోణాలు బయటపడుతుండటమే ఇందుకు సాక్ష్యమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి (corruption), కుంభకోణాల (Scams)పై సిట్టింగ్ జడ్జీ (Sitting judge) విచారణ లేదా హౌస్ కమిటీ (House committee) వేసి విచారణ జరిపించాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) డిమాండ్ చేసింది. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రం అవినీతి కుంభకోణాల కేంద్రంగా మారిపోయిందని.. లెక్కకు మించిన కుంభకోణాలు బయటపడుతుండటమే ఇందుకు సాక్ష్యమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయంతో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయన్నారు. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేసుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
అన్ని శాఖల్లో అవినీతి..
దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతున్నాయి. వాటిని అడ్డుకునే బాధ్యత వహించాల్సినవారే దోపిడీకి మూలస్తంభాలుగా మారుతున్నారు. ఈ పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. మంత్రులే కుంభకోణాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదు, అవమానం కూడా. ఈ కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోంది. సామాన్య ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటోంది అని ప్రతిపక్షం ఆరోపించింది.
మంత్రులు రాజీనామా చేయాలి..
విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి. ఇది తప్పనిసరి అని గుర్తు చేస్తున్నాం. ప్రజా ధనాన్ని రక్షించడం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం, అవినీతి అక్రమాలను అడ్డుకోవడం సీఎం బాధ్యత అని బీఆర్ఎస్ స్పష్టం చేసింది.
మాటల్లో నీతి వాక్యాలు.. చేతల్లో దోపిడీ..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. మాటల్లో నీతి వాక్యాలు.. చేతల్లో దోపిడీ.. ఇదే కాంగ్రెస్ పాలనకు ప్రతీకగా మారింది. అవినీతిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం అయ్యింది. ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేదా కాంగ్రెస్ ప్రోత్సాహమా అనే అనుమానం ప్రజల్లో మరింత బలపడుతోంది అని బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో స్వయంగా సీఎం ప్రకటించారు. మీ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. మీ మాటపై మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై వెంటనే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకొని.. ప్రజా ధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని ప్రతిపక్ష నేతలు వెల్లడించారు.
- సివిల్ సప్లై స్కాం
- అమృత్ టెండర్ల స్కాం
- KLSR స్కాం
- నైనీ కోల్ బ్లాక్ – సింగరేణి స్కాం
- సింగరేణి ఓబీ స్కాం
- సోలార్ పవర్ స్కాం
- NTPC థర్మల్ పవర్ స్కాం
- హెచ్‌సీయూ భూముల స్కాం
- లగచర్ల ల్యాండ్ స్కాం
- కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా స్కాం
- ఎక్సైజ్ మైక్రో బ్రూవరీ స్కాం
- హమ్ రోడ్స్ స్కాం
- TDR స్కాం
- యంగ్ ఇండియా స్కూల్స్ స్కాం
- ఫోర్త్ సిటీ స్కాం
- హిల్ట్ స్కాం
- అక్రమ మైనింగ్ స్కాం
- డెక్కన్ సిమెంట్స్ స్కాం
- మంచి రేవుల దేవాదాయ భూముల కుంభకోణం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





