త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఉత్త‌ర తెలంగాణ అంతా..గ్రామీణ‌మా?

క్యూర్..ప్యూర్..రేర్ కాన్సెప్ట్‌లో భాగంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లను గ్రామీణ ప్రాంతాలుగా ముద్ర వేయ‌డంపై బీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు

a

News | Published On Dec 10, 2025, 7.32 pm IST

ఉత్త‌ర తెలంగాణ అంతా..గ్రామీణ‌మా?
Advertisement

ఉత్త‌ర తెలంగాణ అంతా..గ్రామీణ‌మా?
త్రినేత్ర‌.న్యూస్‌: క్యూర్..ప్యూర్..రేర్ కాన్సెప్ట్‌లో భాగంగా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లను గ్రామీణ ప్రాంతాలుగా ముద్ర వేయ‌డంపై బీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విస్తృతమైన తెలంగాణ ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతమనడాన్నే తప్పు పడుతున్నానంటూ విమ‌ర్శించారు. అందులోనూ ఉత్త‌ర తెలంగాణ‌ను పూర్తిగా గ్రామీణ‌ప్రాంతంగా ప‌రిగ‌ణించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. " గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా కేసీఆర్ హయాంలో సమ్మిళిత అభివృద్ధి జ‌రిగింది. వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాలను కలుపుకుంటూ రాష్ట్రమే ఒక క్లస్టర్ గా అభివృద్ధి ని కొనసాగించాల్సి ఉంది. వ్యవసాయం అన్ని దిక్కుల్లో జరగాలి.. పరిశ్రమలు అన్ని దిక్కుల్లో రావాలి.వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి పెద్ద నగరాలను గ్రామీణ ప్రాంతాలుగా ముద్ర వేసే హక్కు నీకెవరిచ్చిండ్రు ? గ్లోబల్ సమ్మిట్ పేరుతో తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకు ఆచరణ సాధ్యం? విజన్ 2047 డాక్యుమెంట్స్ పై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రభుత్వం ఎంతో హడావిడి ప్రదర్శిస్తున్న‌ది. పెట్టుబడులు ఆకర్షించడం సరే. కానీ, వాటిపై విపరీతమైన ఆశలు పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టరాదు. పెట్టుబడులు రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ పై ఆధారపడి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డీ... తెలంగాణ దివాళ తీసిందని, అప్పులు పుట్టడం లేద‌ని, ఢిల్లీ వెళితే చెప్పులు ఎత్తుకెళ్లేవాడిలా నన్ను చూస్తున్నారంటూ నువ్వు చేసిన‌ వ్యాఖ్యానాలు తెలంగాణ కు నష్టం చేసేవి అనే విషయం ఇప్పటికైనా గుర్తించాలి. ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ లు పెట్టినప్పుడయినా…తెలంగాణ దివాళాతీసింది, తెలంగాణలో ఏమీ లేదు, అప్పులపాలయింది లాంటి మాటలు బంద్ చేయాలి. పరిపాలకులు వస్తుంటారు పోతుంటారు.. ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది కనుక రాష్ట్ర ప్రజల అభివృద్థిని ఆకాంక్షించే వాడిగా రేవంత్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడవద్దు. ఫ్యూచర్ సిటీ కడతాం అంటున్నారు. రేపటి నాడు హైదరాబాద్ ను విస్తరించుకుంటూ పోవాలి. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ చాలా అశాస్త్రీయంగా ఉంది. నీ బేసిక్ పాలసీ క్యూర్..ప్యూర్..రేర్ కాన్సెప్టే రాంగ్..” అంటూ వినోద్‌కుమార్ స్ప‌ష్టం చేశారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement